English   

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు నాని.. 

Nani-NTR
2018-09-26 16:25:08

స‌రిగ్గా ఏడాది కింద ఎన్టీఆర్ కు ఓ స‌మ‌స్య వ‌చ్చింది. కంటినిండా నిద్ర కూడా పోడానికి లేనంత బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. దానికి కార‌ణం బిగ్ బాస్. ఆ షూటింగ్ చేసి.. అప్పుడే మ‌ళ్లీ జై ల‌వ‌కుశ షూటింగ్ చేసి అటూ ఇటూ ఫుల్ బిజీగా ఉన్నాడు జూనియ‌ర్. జై ల‌వ‌కుశ విడుద‌ల‌య్యే స‌మ‌యానికి ఎన్టీఆర్ అయితే బిజీలో మునిగిపోయి బాగా అలిసిపోయాడు కూడా. ఇదే ఇప్పుడు నానికి కూడా జ‌రుగుతుంది. ఈయ‌న కూడా బిజీ షెడ్యూల్ కు బ‌లైపోతున్నాడు. ఓ వైపు బిగ్ బాస్ సీజ‌న్ 2 చేస్తూనే మ‌రోవైపు దేవదాస్ సినిమా చేసాడు. ఇప్పుడు ఈ రెండూ ఒకేసారి వ‌స్తున్నాయి. ఈ వారం బిగ్ బాస్ ఫినాలే ఉంది.. మ‌రోవైపు దేవ‌దాస్ విడుద‌ల ఉంది.  అందుకే త‌న లైఫ్ లోనే ఈ వారం ఉన్నంత ఒత్తిడి ఎప్పుడూ లేదంటున్నాడు నాని. ఈ వారం కానీ అయిపోయిందంటే ఆదివారం త‌ర్వాత పెద్ద బ‌రువు త‌గ్గిపోతుంద‌ని.. హాయిగా తాను ఏ కాశీకో పోతాన‌ని చెబుతున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఆ మాత్రం బిజీ ఉన్న‌పుడు ఈ మాత్రం ఒత్తిడి కూడా క‌చ్చితంగా ఉంటుంది. ఎన్టీఆర్ కు త‌ప్ప‌లేదు.. ఇప్పుడు నానికి కూడా త‌ప్ప‌లేదు. ఒకే సారి అన్ని ప‌నులు చేయాలంటే ఎవ‌రైనా ఒత్తిడిలో ప‌డిపోతారు. నాని దీనికి మిన‌హాయింపు కాదు. అయినా ఇంకా నాలుగు రోజులు అయితే నాని టెన్ష‌న్స్ అన్నీ తీరిపోతాయి. మ‌రి చూడాలిక‌.. ఎన్ని రోజులు ఎక్క‌డికి ఎగిరిపోతాడో ఈ హీరో..? 

More Related Stories