English   

దేవ‌దాస్ ను భ‌య‌పెడుతున్న సెంటిమెంట్.. 

Deva-Das
2018-09-26 10:36:03

ఇండ‌స్ట్రీలో ఏది న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా సెంటిమెంట్ ల‌ను బాగానే న‌మ్ముతుంటారు. దేవ‌దాస్ విడుద‌ల‌కు మ‌రొక్క రోజు ఉన్న ఈ స‌మ‌యంలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఈ సినిమాను భ‌య‌పెడుతుంది. అదే ఓల్డ్ టైటిల్స్. అవును.. ఈ మ‌ధ్య చాలా సినిమాల‌కు పాత టైటిల్స్ క‌లిసి రావ‌డం లేదు. బంగారం లాంటి టైటిల్స్ తీసుకుని వాటిని దారుణంగా ముంచేస్తున్నారు మ‌న హీరోలు. జంబ ల‌కిడి పంబ లాంటి క్లాసిక్ టైటిల్ తో సినిమా చేసి ప్లాప్ ఇచ్చాడు శ్రీ‌నివాస రెడ్డి. ఇక న‌ర్త‌న‌శాల అంటూ వ‌చ్చి

అడ్ర‌స్ లేకుండా పోయాడు నాగ‌శౌర్య‌. ఈ మ‌ధ్యే నితిన్ కూడా శ్రీ‌నివాస క‌ళ్యాణం అంటూ వ‌చ్చి డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఇలా పాత టైటిల్స్ అంటూ వ‌చ్చిన హీరోలంద‌రికీ వ‌ర‌స‌గా షాకులు త‌గులుతున్నాయి. మ‌రి ఇప్పుడు దేవ‌దాస్ ఏం చేస్తాడో అనే టెన్ష‌న్ నాని, నాగార్జున‌లో క‌నిపిస్తుంది. దేవ‌దాస్ కూడా ఓల్డ్ టైటిలే.. ఇంకా చెప్పాలంటే తెలుగు ఇండ‌స్ట్రీని మార్చేసిన సినిమా. ఇలాంటి టైటిల్ ను తీసుకుని వ‌స్తున్నారు ఈ ఇద్ద‌రు హీరోలు. అందుకే ఇంకాస్త ఎక్కువ టెన్ష‌న్ పడుతున్నారు. ఎందుకంటే సినిమా తేడా కొడితే క‌చ్చితంగా ద‌ర్శ‌కుడితో హీరోల‌కు కూడా అక్షింత‌లు ప‌డ‌టం ఖాయం. అందుకే చాలా భ‌య‌ప‌డుతున్నారు ఈ హీరోలు. మ‌రి దేవ‌దాస్ ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌రొక్క రోజులో తేల‌నుంది. 

More Related Stories