English   

అర్జున్ రెడ్డి రూట్ లో ‘నోటా’

Vijay Dewvarakonda's NOTA Movie
2018-09-26 18:26:44

విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ఈ దశాబ్ధంలోనే ఏ సినిమాకూ రానంతగా ప్రీ రిలీజ్ హైప్ అర్జున్ రెడ్డికి వచ్చింది. అందుకే ఈ సినిమా ప్రీమియర్స్ కూ విపరీతమైన డిమాండ్ వచ్చింది. పెళ్లి చూపులు వంటి సాఫ్ట్ సినిమా మాత్రమే చేసి ఉన్న విజయ్ కి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణం.. డబుల్ మీనింగ్స్ ఉన్న డైలాగ్స్ తో పాటు మనోడు పబ్లిక్ ఫంక్షన్స్ లో చేసిన కామెంట్స్ అండ్ ట్రైలర్. మొత్తంగా ఓ స్టార్ హీరో రేంజ్ లో రిలీజ్ కు ముందే ఈ సినిమా కేవలం హైదరాబాద్ లోనే ఏకంగా 150 స్క్రీన్స్ లో ప్రీవ్యూస్ పడ్డాయ్.. ప్రివ్యూస్ తోనే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. తర్వాత మౌత్ అండ్ స్మార్ట్ టాక్స్ తో ఓ రేంజ్ కు వెళ్లిందీ సినిమా. ఇక ఆ తర్వాత కథంతా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండకు తిరుగులేని క్రేజ్ ఉంది. అయినా మరోసారి నోటా కోసం అర్జున్ రెడ్డినే ఫాలో అవుతున్నారు. కాకపోతే చిన్న మార్పుంది.

విజయ్ దేవరకొండ తమిళ్ లోనూ డెబ్యూ ఇస్తోన్న సినిమా నోటా. ఆరిమా నంబి, ఇరుముగన్ వంటి సినిమాలు చేసిన ఆనంద్ శంకర్ డైరక్ట్ చేస్తోన్న సినిమా ఇది. అక్కడి టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన నోటా అక్టోబర్ 5న వాల్డ్ వైడ్ గా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. అయితే అక్టోబర్ 4నే ఈ సినిమా ప్రీమియర్స్ ను వేయబోతున్నారు. అయితే ఈ సారి తెలుగులో కాకుండా కేవలం యూఎస్ లోనే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా గీత గోవిందంతో కెరీర్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండకు ఈ విషయంలో మేజర్ షేర్ ఓవర్శీస్ నుంచే వచ్చింది. ఈ కారణంగాన ఆ క్రేజ్ ను వెంటనే క్యాష్ చేసుకోవచ్చనే ఇలా అక్కడ ప్రీమియర్స్ ప్లాన్ చేసి ఉంటారని వేరే చెప్పక్కర్లేదేమో.

అయితే ఏ మాటకామాటే.. నోటా విషయంలో పెద్దగా క్రేజ్ అయితే కనిపించడం లేదు. సినిమా విడుదలకు ఓ పది రోజులు మాత్రమే ఉంది. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ కూడా కాస్త ఫోర్స్ డ్ గా ఉంది తప్ప నేచురల్ గా అనిపించలేదు. ఇటు తెలుగులోనూ సేమ్ సిట్యుయేషన్. మరోవైపు మొన్న రిలీజ్ డేట్ పోల్ పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికీ గురయ్యాడు. మరి ఈ పరిణామాల మధ్య నోటా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో చూడాలి.

More Related Stories