English   

అమ్మో.. సమ్మోహనం బ్యూటీ సాధిస్తోందే...?

Aditi-Rao-Hydari
2018-09-26 18:54:51

లేటు వయసులో దక్షిణాదిలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అదితిరావు హైదరి. అంత సమ్మోహనంగా ఉంటే లేటు వయసు అంటారేంటీ అనుకుంటున్నారా.. నిజమే.. అమ్మడు చూడ్డానికి చిన్న పిల్లలా కనిపించినా.. ఇప్పటికే మూడు పదుల వయసు క్రాస్ చేసింది. దశాబ్ధం క్రితమే పెళ్లి చేసుకుని వెంటనే విడాకులు తీసుకుంది. ఆ తర్వాతే తను వెండితెరను ఎంచుకుంది. బాలీవుడ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ రకరకాల ఆఫర్స్ తెచ్చుకున్నా.. మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మణిరత్నం సినిమా ‘కాట్రు వేలాయిదై’తో సౌత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఆ వెంటనే తెలుగులో ఇంద్రగంటి మోహన కృష్ణ తన సమ్మోహనంలో తీసుకుని మన ఆడియన్స్ కు తన టాలెంట్ తెలిసేలా చేశాడు. అంతేనా తెలుగులో తన తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పుకుంది. అన్నట్టు తను తెలుగు వారి అమ్మాయే. సరే అవన్నీ పక్కన బెడితే తను ప్రస్తుతం తమిళ్ లో టాప్ రేంజ్ కు వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా తను ధనుష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 

నిజానికి ధనుష్ సరసన తనకు లాస్ట్ ఇయరే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నో చెప్పింది. బట్ ఈసారి ఆ ఛాన్స్ వదులుకోలేదు. అయితే ఈ సారి ధనుష్ సరసన కాదు. అతని డైరెక్షన్ లో. యస్ ధనుష్ డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమాలో అదితిరావును తీసుకున్నారు. తెలుగు, తమిళ్ లో బై లింగ్వువల్ గా వస్తోన్న ఈ మూవీలో ధనుష్ తో పాటు నాగార్జున, శ్రీకాంత్ తో పాటు ఎస్.జే సూర్య కూడా నటిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథగా వస్తోన్న ఈ మూవీపై కోలీవుడ్ భారీ క్రేజ్ ఉంది. అలాంటి ప్రాజక్ట్ లో భాగమైనందుకు అదితి తెగ హ్యాపీగా ఫీలవుతోంది. ఫ్యూచర్ లో తనిక తమిళ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తానంటూ క్లియర్ ప్లాన్ తో ముందుకువెళుతోంది.  ప్రస్తుతం తెలుగులోనూ వరుణ్ తేజ్ సరసన ‘అంతరిక్షం’ సినిమాలోనూ నటిస్తోన్న అదితికి ఆలస్యంగానైనా మంచి స్టార్డమ్ వచ్చే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. 

More Related Stories