English   

నాగ్, నాని మందు మాట‌లు బాగున్నాయిగా..

Nani-Nagarjuna
2018-09-26 19:48:56

మ‌న‌కు ముందుమాటలు తెలుసు కానీ ఈ మందు మాట‌లు ఏంటి అనుకుంటున్నారా..? అవును.. ఏదైనా పుస్త‌కం తెరిచిన‌పుడు ముందుమాట ఉంటుంది. ఆ పుస్త‌కం ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌డానికి అది. ఇప్పుడు నాగార్జున‌, నాని కూడా ఇలాంటి ముందుమాట‌లే చెప్పారు. కాక‌పోతే ఈ ముందుమాట‌లు కాస్తా ఇప్పుడు మందు మాట‌లు అయిపోయాయి. తాజాగా దేవ‌దాస్ ప్రెస్ మీట్ లో ఈ ఇద్ద‌రు హీరోలు మందు గురించి మీడియా ముందే మాట్లాడేసారు. మ‌ద్యం తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అంటూ వాళ్లే సినిమాల్లో చెప్పుకుంటూ బ‌య‌ట మాత్రం వాళ్లే ప్ర‌మోట్ చేస్తున్నారు.  నాని నువ్వు రా తాగుతావా.. లేదంటే నేనే నేర్పించానా అంటూ నాగ్ అడిగిన ప్ర‌శ్న‌కు తాగ‌ను స‌ర్.. సోడా, వాట‌ర్ ఉండాల్సిందే అని స‌మాధానం చెప్పాడు నాని. దానికి వెంట‌నే నేనైతే పూర్తిగా రా తాగేస్తాన‌ని నాగ్ మ‌రో ఆన్స‌ర్ ఇచ్చాడు. దానికి ముందు ఛీర్స్ చెప్ప‌కుండా తాగేసావ్ ఏంట్రా అనేది కేవ‌లం సినిమాల్లోనే ఉంటుంద‌ని.. రియ‌ల్ లైఫ్ లో అంత టైమ్ కూడా ఉండ‌దు.. మొదలుపెడితే ఆప‌డం అనేది ఉండ‌ద‌ని నాని చెప్పాడు. అస‌లు ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి చాలా సింపుల్ గా మందుకు ఫుల్ ప్ర‌మోష‌న్ ఇచ్చేసారు. ఇది చూసి.. విని అక్క‌డున్న మీడియా కూడా షాక్ తో పాటు ఎంజాయ్ కూడా చేసింది. స్టార్ హీరోలు ఇలా మందుమాట‌లు చెబుతుంటే విన‌డానికి కూడా హాయిగా ఉంది. అంతేమ‌రి.. ఇదో ర‌కం మందు ప్ర‌మోష‌న్ అన్న‌మాట‌. 

More Related Stories