English   

సిగ్గు స్విచ్ ఆన్ చేయ్ రాధికా

Radhika Apte Shameless Statement on her Nude Videos
2018-09-27 06:33:28

రాధికా ఆప్టే.. ఈ పేరు వింటే చాలు ఏదో తెలియ‌ని అల‌జ‌డి క‌లుగుతుంది మ‌న‌సులో. అందాల ఆర‌బోత‌కైనా.. అభిన‌యంతో చంపేయ‌డానికైనా దేనికైనా రెడీ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అవ‌స‌రం అనుకుంటే ధోనీ లాంటి సినిమాల్లో న‌ట‌న‌తో మాయ చేస్తుంది.. కాద‌నుకుంటే పార్చ్డ్ లాంటి సినిమాల్లో న్యూడ్ గానూ న‌టించేస్తుంది. అస‌లు ఈ భామ అనుకోవాలే కానీ కానిది ఏం లేదు. అంత‌గా రెచ్చిపోతుంది రాధికా. అయితే అప్పుడు అప్పుడు క‌నీసం సిగ్గు అనే స్విచ్ అనేది ఒక‌టి ఉంటుంది అది ఆన్ చేస్తే బాగున్ను అంటున్నారు అభిమానులు. లేక‌పోతే ఈమె మాట్లాడే మాట‌లు హ‌ద్దులు దాటేస్తున్నాయి మ‌రి.

మొన్న‌టికి మొన్న డ‌బ్బుల కోసం ఏదైనా చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చిన రాధికా ఇప్పుడు త‌న న్యూడ్ వీడియోస్ గురించి అమ్మ‌తోనే చ‌ర్చించానంటూ సిగ్గు లేకుండా చెబుతుంది. అస‌లు అమ్మ‌తో ఎవ‌రైనా అలాంటి మాట‌లు మాట్లాడ‌తారా.. కానీ తాను మాట్లాడాన‌ని చెప్పి ఏం చెప్పాల‌నుకుంటుందో ఎవ‌రికీ అర్థం అయితే కావ‌డం లేదు. అమ్మ‌డు ఏది అనిపిస్తే అది మాట్లాడటం త‌ప్ప ముందు వెన‌క ఆలోచించేది అయితే ఉండ‌దు. ఏం చెప్పాల‌నుకున్నా నేరుగా చెప్పేస్తుంది. హీరోలు త‌న‌ను ప‌క్క‌లోకి ర‌మ్మంటున్నారంటూ ఆ మ‌ధ్య ర‌చ్చ చేసింది రాధికా. ఇప్పుడేమో ఇలా న్యూడ్ వీడియోస్ ముందు అమ్మ‌.. ఆ త‌ర్వాత డ్రైవ‌ర్ చూసాడంటూ చెప్పింది. మొత్తానికి సంచ‌ల‌నం అనే మాట‌ల‌ను ఎప్పుడూ హ్యాండ్ బాగులోనే పెట్టుకుని తిరుగుతుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే సిగ్గు స్విచ్ ఆన్ చేయ‌మ‌ని చెప్పేది.

More Related Stories