English   

ఎన్టీఆర్ కోసం వేచి చూస్తున్న అభిమానులు

NTR Fans Waiting For Aravinda Sametha Pre Release Event
2018-09-27 10:12:31

ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఆడియో వేడుక లేదు.. దాంతో ఇప్పుడు ఆయ‌న కోసం చూస్తున్నారు. పైగా తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు జూనియ‌ర్ ఎన్టీఆర్. దాంతో వ‌స్తే ఏం మాట్లాడ‌తాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. ఇక ఇప్పుడు అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అక్టోబర్ 3న ఈ వేడుక హైద‌రాబాద్ లోనే జ‌రగ‌బోతుంది. ఈ వేడుక‌కు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కూడా రానున్నాడు. ఆయ‌న‌తో పాటు వీలుంటే బాల‌య్య కూడా వ‌స్తాడ‌ని తెలుస్తుంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ను చూడడం కోసం ఆ డేట్ ను లాక్ చేసుకొన్నారు.

హ‌రికృష్ణ చ‌నిపోయిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి వేడుక కావ‌డంతో ఎన్టీఆర్ చాలా ఎమోష‌న‌ల్ అవుతాడు అన‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఎప్పుడు ఆడియో వేడుకల‌కు వ‌చ్చినా కూడా ఇంటికి జాగ్ర‌త్త‌గా వెళ్లండి.. ఇంట్లో మీవాళ్ళు మీకోసం వేచి చూస్తుంటారు. వాళ్ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి.. వెళ్లి మేం కూడా జాగ్ర‌త్త‌గా వ‌చ్చామ‌ని వాళ్ల ముందు నిల‌బ‌డండి.. అంటూ అభిమానుల‌కు ఓ పాఠం చెబుతుంటాడు నంద‌మూరి చిన్నోడు. త‌న అన్న‌య్య జాన‌కీరామ్ చ‌నిపోయిన త‌ర్వాత ప్ర‌తీసారి ఇది చెప్ప‌డం.. ప్ర‌తీ సినిమాకు ముందు ఓ ముందుమాట వేస్తుంటాడు ఎన్టీఆర్. అయితే జానకిరామ్ మ‌ర‌ణం త‌ర్వాత మ‌ళ్లీ త‌న ఇంటికే ఇలాంటి ఘోరం జ‌రిగింది. దాంతో ఇప్పుడు జూనియ‌ర్ ఏం మాట్లాడ‌తాడు.. ఏం చెప్తాడు అనేది అంద‌ర్లోనూ ఉన్న ఆస‌క్తి.

More Related Stories