English   

బాల‌య్య-బోయ‌పాటి సినిమాపై సంచ‌ల‌న అప్ డేట్.. 

Balakrishna-Boyapati
2018-09-27 11:21:40

బాల‌య్య‌కు కొంద‌రు ద‌ర్శ‌కుల‌తో భ‌లే సింక్ అవుతుంది. వాళ్ల కాంబినేష‌న్ ఎప్పుడు వ‌చ్చినా కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తాయి. ఒక‌ప్పుడు కోడి రామ‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత బి గోపాల్ తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసాడు బాల‌య్య‌. ఓ ర‌కంగా ఆయ‌న కెరీర్ ను పీక్స్ కు తీసుకెళ్లిన ద‌ర్శ‌కులు వాళ్లే. ఆ రేంజ్ లో బాల‌య్య‌తో మాయ చేస్తున్న ఈ తరం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. మిగిలిన ద‌ర్శ‌కులంతా ఫ్లాపులిస్తున్న స‌మ‌యంలో సింహా సినిమా చేసి బాల‌య్య కెరీర్ కు ఊపిరి ఊదాడు బోయ‌పాటి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడా బాల‌య్య‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు బోయ‌పాటి శీను. జ‌య జాన‌కీ నాయ‌కా ఫ్లాప్ అయినా కూడా బోయ‌పాటికి వ‌చ్చిన న‌ష్ట‌మేం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడు.  ఈ చిత్రం జ‌న‌వ‌రిలో సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య సినిమా ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే బాల‌య్య కోసం క‌థ సిద్ధం చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి బాల‌య్య‌తో బోయ‌పాటి శీను సినిమా చేయ‌బోతుంది. ఇది కూడా ప‌వ‌ర్ ఫుల్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉండ‌బోతుంది. అయితే ఈ చిత్రం విష‌యంలో మాత్రం ఓ సంచ‌ల‌న వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లోనే పూర్తి చేయాల‌నేది బాల‌య్య కండీష‌న్. ఎందుకంటే ఆయ‌న‌కు మ‌ళ్లీ ఎల‌క్ష‌న్స్ ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే ముందు ఈ చిత్రం పూర్తి కావాలి. అందుకే అలా చేసేట్లు అయితేనే ఈ చిత్రం ఉంటుంద‌ని చెప్పాడు బోయ‌పాటి. మ‌రి 100వ సినిమా టైమ్ లో బాల‌య్య ఇచ్చిన డెడ్ లైన్ అందుకోవ‌డంలో విఫ‌లం అయిన బోయ‌పాటి.. ఈ సారి అయినా అందుకుంటాడేమో చూడాలి..!

More Related Stories