English   

ఆంధ్రా.. తెలంగాణ‌కు న్యాయం చేస్తున్న విజ‌య్..

NOTA
2018-09-27 13:06:30

అవును.. రాజ‌కీయాల్లోకి రాకుండానే రాజ‌కీయాలు బాగానే ఒంట ప‌ట్టించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. నోటా సినిమాలో రాజ‌కీయాలు రియ‌ల్ లైఫ్ లో కూడా బాగానే నేర్చుకున్నాడు. అదే ఇప్పుడు అప్లై చేస్తున్నాడు కూడా. ఈ కుర్ర హీరో సినిమా అంటే ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి మాట‌ల్లో చెప్పడం సాధ్యం కాదు. ఈయ‌న ఒక్క‌సారి రెచ్చిపోయాడంటే రికార్డుల‌న్నీ వెంట న‌డ‌వాల్సిందే. ఇప్పుడు కూడా ఈయ‌న న‌టిస్తున్న నోటా సినిమాపై అంచ‌నాలు ఇలాగే ఉన్నాయి. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం. దీని ప్ర‌మోష‌న్స్ చాలా భిన్నంగా చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌తీ సినిమాకు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఒక్క‌టే ఉంటుంది. కానీ దీనికి మాత్రం రెండు చేస్తున్నారు.  అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణ అభిమానుల‌కు స‌మ‌న్యాయం చేస్తున్నాడు. ఒక్క ఫంక్ష‌న్ పెడితే క‌చ్చితంగా మ‌రో ప్రాంతం అభిమానులు హ‌ర్ట్ అవుతార‌ని అక్క‌డా ఇక్కడా రెండు భారీ స‌భ‌లు ఏర్పాటు చేస్తున్నారు ద‌ర్శక నిర్మాత‌లు. వీటిని ప్రీ రిలీజ్ ఈవెంట్ అని కూడా అన‌డం లేదు.. రాజ‌కీయ కోణం ఉన్న సినిమా కాబ‌ట్టి ది నోటా ప‌బ్లిక్ మీట్ అని పేరు పెట్టేసారు. విజ‌య‌వాడ‌లో సెప్టెంబ‌ర్ 30న‌.. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్ లో రెండు వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. మొత్తానికి ఈ రెండు వేడుక‌ల‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెర‌గ‌డం మాత్రం ఖాయం. అక్టోబ‌ర్ 5న భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా విడుద‌ల కానుంది. 

More Related Stories