English   

దిల్ రాజు మాట నాని వింటాడంటారా..? 

Nani-devadasu
2018-09-27 18:33:42

టాలీవుడ్ లో నానికి బాగా ఇష్ట‌మైన నిర్మాత‌ల్లో దిల్ రాజు కూడా ఉంటాడు. ఈయ‌న గ‌తేడాది నానికి రెండు హిట్లు ఇచ్చాడు. నేనులోక‌ల్.. ఎంసిఏతో ఈ హీరో కెరీర్ మ‌రో స్థాయికి వెళ్లింది. ఇక ఇప్పుడు నాని డేట్స్ కోసం మ‌రోసారి ప్ర‌య‌త్నిస్తున్నాడు ఈ నిర్మాత‌. అయితే నాని మాత్రం అంత ఆస‌క్తి చూపించ‌డం లేదు. కార‌ణం ఈ సారి రీమేక్ క‌థ‌తో రాజుగారు రావ‌డ‌మే. అస‌లే నానికి రీమేక్ క‌థ‌లంటే చ‌చ్చేంత భ‌యం. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. త‌న కెరీర్ లో చేసిన భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు.. ఆహా క‌ళ్యాణం ప్లాప్ అయ్యాయి. దాంతో అటువైపు కూడా వెళ్ళ‌డం మానేసాడు నాని. ఇలాంటి టైమ్ లో విజ‌య్ సేతుప‌తి 96 రీమేక్ లో నానిని న‌టింప‌చేయాల‌ని చూస్తున్నాడు దిల్ రాజు. 

ఈ చిత్ర హ‌క్కులు ఇప్పుడు రాజుగారి చేతుల్లో ఉన్నాయి. ముందు డ‌బ్బింగ్ అనుకున్నా కూడా సినిమా చూసి రీమేక్ అయితే బెట‌ర్ అనుకుంటున్నాడు. అయితే నాని మాత్రం ఈ చిత్రం రీమేక్ పై అంతగా ఆస‌క్తి చూపించ‌డం లేదు. అక్టోబ‌ర్ 4న 96 విడుద‌ల కానుంది. ఆ సినిమా ఒక‌వేళ హిట్ అయినా కూడా నాని మాత్రం అటు వైపు వెళ్లేలా క‌నిపించ‌డం లేదు ఈ హీరో. పైగా ఇప్పుడు నాని వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే జెర్సీ సినిమా ద‌స‌రాకు మొద‌లు పెట్ట‌బోతు న్నాడు. ఆ త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ యేలేటితోనూ ఓ సినిమా ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాని ఇప్పుడు ఫుల్ బిజీ. ఈయ‌న్ని రాజు ఒప్పించాలంటే ఇప్పుడు చాలా క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. 

More Related Stories