English   

టాక్సీవాలా, సవ్యసాచి.. సమ్ థింగ్ రాంగ్

Savyasachi-Taxiwala
2018-09-27 19:04:18

కొన్ని సినిమాలు ముందు ఆసక్తిని పెంచుతాయి. క్యూరియాసిటీ కలిగిస్తాయి. కానీ సడెన్ గా వాటి గురించి ఆడియన్స్ మర్చిపోతారు. అందుకు కారణం చాలాసార్లు మేకర్సే. ఈ మధ్య కాలంలో అలా మొదట్లో ఆకట్టుకుని ఆ తర్వాత ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసిన సినిమాల్లో టాక్సీవాలాతో పాటు సవ్యసాచి కూడా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా.. సినిమాపై మొదట్లో మంచి అంచనాలున్నాయి. అందుకు కారణం.. వాళ్లు చేసిన ప్రమోషన్స్. అలాగే దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుంచి వస్తోన్న సినిమా అనే ప్రచారం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచడానికి కారణమైంది. మొత్తంగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంటూ తెగ ఊరించిన ఈ సినిమాను అంతా కలిసి పక్కన బెట్టారు.తర్వాత విజయ్ గీత గోవిందంతో భారీ హిట్ కొట్టాడు. కానీ ఇప్పుడీ టాక్సీవాలాను పూర్తిగా పక్కన బెట్టాడు. ఇలా చేయడం అంటే ఓ దర్శకుడి కెరీర్ తో ఆడుకోవడమే. సినిమా బాలేకపోతే ముందే ఆపేయొచ్చు. కానీ మొత్తం పూర్తయ్యాక.. అలా ఆపడం.. అది కూడా అర్థం లేని కారణాలు చెప్పడం కరెక్ట్ కాదు.. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి టాక్సీవాలా ఇక విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఇక అలాగే ఆసక్తిని పెంచిన మరో సినిమా సవ్యసాచి. 

వరుసగా ఫ్లాపులు వస్తోంటే..  అసలు తను ఎలాంటి సినిమా చేయాలా అని నాగచైతన్య సైతం డైలమాలో ఉన్నప్పుడు.. అతన్ని ప్రేమమ్ తో మళ్లీ ట్రాక్ ఎక్కించిన దర్శకుడు చందు మొండేటి. అప్పటికే కార్తికేయతో సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు చందు. అలాంటి చందు.. చైతూకు ప్రేమమ్ తో తిరుగులేని హిట్ ఇవ్వడమే కాదు.. అతన్నుంచి అక్కినేని ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో కూడా అర్థమయ్యేలా చెప్పాడు. ఇది నచ్చే చైతూ మరోసారి చందు దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇది రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత మొదలైంది. కానీ ముందు విడుదలైంది మాత్రం శైలజారెడ్డి అల్లుడు. నిజానికి సవ్యసాచి కంటెంట్ ఉన్న సినిమా. పైగా దర్శకుడు కొత్తతరహా కథల్ని ఇష్టపడతాడు. అలాంటి దర్శకుడి కంటే రొటీన్ కథలతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తోన్న మారుతికి చైతూ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కట్ చేస్తే వాళ్లు చెప్పుకున్నంత గొప్ప హిట్ అయితే కాదు శైలజారెడ్డి అల్లుడు. దీంతో ఇప్పుడు మళ్లీ సవ్యసాచిపైనే కాన్ సెంట్రేట్ చేస్తున్నారు. మొదట్లో తాము ఏదైతే వర్కవుట్ కాదని.. మార్పులు చెప్పారో.. ఇప్పుడు వాటికి కూడా ఓకే చెబుతున్నాడట చైతూ. మొత్తంగా సవ్యసాచి కూడా వస్తుందనే గ్యారెంటీ లేదు. వచ్చినా.. ఈ సినిమాను చే అండ్ ఫ్యామిలీ సీరియస్ గా తీసుకుంటుందనుకోలేం. అంటే మరో దర్శకుడి కెరీర్ తో ఆటలన్నమాట. ఏదేమైనా.. సినిమా ఇండస్ట్రీలో కొందరు చేసే కొన్ని కథలంతే ఉంటాయ్.. 

More Related Stories