English   

ఆ ఆల్ టైమ్ గ్రేట్ మూవీకి సీక్వెల్ వస్తోందా..?

Kamal-Kshatriya-Putrudu
2018-09-27 19:11:45

కొన్ని సినిమాలు ఆల్ టైమ్ అండ్ ఎవర్ గ్రీన్ మెమరీస్ గా ఉంటాయ్. అలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. వచ్చినా ప్రతి సినిమా ఆకట్టుకుంటుందని చెప్పలేం. అలాంటి సినిమాల్లో ఒకటి ‘క్షత్రియ పుత్రుడు’. 1992 అక్టోబర్ 25న విడుదలైందీ సినిమా. తమిళ్ లో తేవర్ మగన్ గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో క్షత్రియ పుత్రుడుగా డబ్ చేశారు. తెలుగు సినిమా కాకపోయినా తమిళ్ తో పాటుగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందీ సినిమా.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గాడ్ ఫాదర్ టైప్ స్టోరీస్ లో ఇదే మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. మోస్ట్ పాపులర్ సౌత్ ఇండియన్ సినిమా డైరెక్టర్ భరతన్ ఈ చిత్రానికి దర్శకుడు. కమల్ హాసన్ తో పాటు శివాజీ గణేశన్, గౌతమీ, రేవతి, నాజర్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏకంగా ఐదు జాతీయ అవార్డులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  ముఖ్యంగా ఇళయరాజా స్వరాలు, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్.. 

అలాగే 65వ అకాడమీ అవార్డులకు గాను సినిమాను భారతదేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డు కోసం అధికారిక ఎంట్రీగా పంపారు. 1994 సంవత్సరపు టొరంటొ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రం ప్రదర్శితమైంది. అలాంటి గ్రేట్ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు కమల్ హాసన్. ఇప్పటికే తన ఆల్ టైమ్ గ్రేట్ మూవీస్ లో ఒకటైన భారతీయుడుకూ సీక్వెల్ చేస్తోన్న కమల్ ఇప్పుడు క్షత్రిపుత్రుడు వంటి క్లాసిక్ కు సైతం సీక్వెల్ చేస్తానని చెప్పడం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్టు.. కొన్ని సినిమాలు ఆల్ టైమ్ మెమరీస్. వాటిని అలా తాజాగానే ఉంచాలి తప్ప.. ఇలా సీక్వెల్స్, రీమేక్స్ అంటూ చెడగొట్ట కూడదు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినట్టు చెబుతోన్న ఈ మూవీ సీక్వెల్ వివరాలను త్వరలోనే తెలియచేస్తాడట కమల్ హాసన్. 

More Related Stories