English   

థగ్స్ హిందూస్తాన్.. కామెడీ పీస్ లా ఉందే...?

Thugs-of-Hinduthan
2018-09-27 19:52:23

గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో కానీ.. ఫిల్మీ సర్కిల్స్ లోకానీ తెగ హల్చల్ చేస్తోన్న సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్ నటించిన సినిమా. కత్రినా కైఫ్, దంగల్ ఫేమ్ ఫాతిమా సనాఖాన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. తెలుగులో రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ చూశాక.. దీనికా ఇంత హైప్ ఇచ్చింది అనిపించక మానదు. నిజమే.. ఈ సినిమా గురించి దాదాపు యేడాది కాలంగా తెగ పొగుడుతూ.. వస్తున్నారు. పైగా రాజమౌళి బాహుబలిని కొట్టే సినిమా ఇదే అంటూ బాలీవుడ్ లో కూడా తెగ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ తీరా ట్రైలర్ చూశాక తెలిసింది. ఇది కామెడీ పీస్ లా ఉందని.. 

ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు ఇండియాకు వచ్చిందైతే వ్యాపారం కోసమే.. కానీ ఇప్పుడు వాళ్లు అధికారం చెలాయిస్తున్నారు అంటూ మొదలైన ఈ ట్రైలర్ అబ్బో ఏదో అద్బుతం చూస్తున్నాం అనిపించేలా మొదలైంది. కానీ ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ రంగంలోకి దిగాడో అప్పటి నుంచో ఇదేదో కామిక్ స్టోరీలా మారింది. యస్.. ఇప్పుడు అమితాబ్ వయసుకు ఇలాంటి సాహసాలు చేస్తే ఎవరు చూస్తారు. మరోవైపు ఆమిర్ ఖాన్ కంప్లీట్ గా కామెడీ పీస్ లా ఉన్నాడు. కొన్ని షాట్స్ చూస్తే ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ను కాపీ చేసినట్టుగా ఉన్నాయి. అటు హీరో ఎవరైనా.. సినిమా ఏదైనా కత్రినా కైఫ్ మారదంతే అనేలా సింగిల్ డ్యాన్స్ బిట్ లా ఉందీ భామ. ఇక దంగల్ బ్యూటీ మాత్రం కాస్త ఫర్వాలేదనిపించేలా ఉంది. మొత్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పూర్తిగా కామిక్ పీస్ లా ఉందనేది తెలుగులోనే కాదు.. బాలీవుడ్ లోనూ విమర్శలు వస్తున్నాయి. 

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ ఆదిత్య చోప్రా నిర్మించాడు. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకూ నిజంగానే బాహుబలిని మించిన సినిమా రాబోతోందని మనాళ్లు కూడా కొందరు భావించారు. బట్ ట్రైలరే ఇలా ఉంటే ఇంక సినిమాను మరోలా ఎలా ఎక్స్ పెక్ట్ చేస్తాం.. 

More Related Stories