English   

ఫ్యాన్స్ కు బోనస్ ప్రకటించిన యంగ్ టైగర్

NTR-Aravinda-Sametha
2018-09-27 23:27:49

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న అరవిందసమేత వీరరాఘవకు సంబంధించి అభిమానులకు బోనస్ ప్రకటించాడు ఎన్టీఆర్. సినిమాకు బోనస్ ఏంటి రిలేషన్ అనుకుంటున్నారా..? సింపుల్.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫార్మ్ చేశాడు. అది బోనస్ ఎలా అవుతుందీ అనుకుంటున్నారా..? వెరీ సింపుల్.. ఈ సినిమా దసరా సందర్బంగా వస్తోంది కదా. అదే బోనస్. అంటే పండగ అండ్ బోనస్ అన్నమాట. మొత్తంగా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తర్వాత ఈ మూవీ విడుదల పై కొందరికి డౌట్స్ ఉన్నాయి. కానీ తండ్రి మరణించిన మూడో రోజు నుంచే షూటింగ్ కు అటెండ్ అయిన ఎన్టీఆర్.. అనుకున్న టైమ్ కు సినిమా విడుదలయ్యేలా పూర్తిగా సహకరించాడు. అందువల్లే ఇది చెప్పిన టైమ్ కు వస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న అరవిందుడు ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ కోసం విదేశాల్లో ఉన్నాడు. ఈ నెల చివరి వరకూ అవి కూడా పూర్తవుతాయి. మరోవైపు ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. కాబట్టి ధైర్యంగా డేట్ అనౌన్స్ చేశారు. ఇక ఆడియో కోసం చూసిన ఫ్యాన్స్ కోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. అక్టోబర్ లో వచ్చే మొదటి శనివారం కానీ ఆదివారం కానీ ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన ఈమూవీ కోసం అభిమానులే కాదు.. ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. 

More Related Stories