English   

అన్నాద‌మ్ముళ్లు అధికారం కోసం ఏం చేసారు?

Mani Ratnam's Nawab Movie Review
2018-09-27 23:49:06

మ‌ణిర‌త్నం సినిమా అంటే ఏదో తెలియ‌ని అంచ‌నాలు ఉంటాయి ప్రేక్ష‌కుల్లో. కానీ కొన్నేళ్లుగా అది మిస్సింగ్ అయితే ఇప్పుడు అది మ‌ళ్లీ క‌నిపించే అవ‌కాశం ఉందా..? అస‌లు మ‌ణిర‌త్నం న‌వాబ్ తో ఏం చేసాడు..? అస‌లు మాయ చేసాడా లేదా..?

క‌థ‌:
భూప‌తి రెడ్డి (ప్ర‌కాశ్ రాజ్) పేరు మోసిన గ్యాంగ్ స్ట‌ర్. అత‌డికి ముగ్గురు కొడుకులు ఉంటారు. పెద్దోడు వ‌ర‌ద‌(అర‌వింద్ స్వామి), అత‌డి భార్య చిత్ర (జ్యోతిక‌) పెద్దాయ‌న ద‌గ్గ‌రే ఉంటారు. అనుకోకుండా ఓ రోజు భూప‌తిపై అటాక్ జ‌రుగుతుంది. అప్పుడు విదేశాల్లో త్యాగు(అరుణ్ విజ‌య్), రుద్ర(శింబు) కూడా ఇండియాకు వ‌స్తారు. తండ్రిపై అటాక్ చేసింది ఎవ‌రో తెలుసుకోవాలాని ట్రై చేస్తుంటారు. వాళ్ళ‌కు హెల్ప్ చేస్తుంటాడు పోలీస్ ఆఫీస‌ర్ ర‌సూల్ (విజ‌య్ సేతుప‌తి). తీరా అది చేసింది త‌మ ముగ్గురు కొడుకుల్లో ఒక‌రు అని తెలుసుకుంటాడు భూప‌తి. అక్క‌డ్నుంచి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది అస‌లు క‌థ‌. 

క‌థ‌నం:
మ‌ణిర‌త్నం సినిమా అంటే ఏదో తెలియ‌ని మ్యాజిక్ ఉంటుంది. కొన్నేళ్లుగా అది మిస్ అవుతూనే ఉంది. అయితే ఈ సారి ఆయ‌న ఒకే సినిమాలో ఏకంగా ఐదుగురు స్టార్స్ ను తీసుకొస్తుంటే క‌చ్చితంగా ఏదో మాయ చేస్తున్నాడ‌ని ముందు నుంచి అంచ‌నాలున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ చాలా ఏళ్ల త‌ర్వాత ఆయ‌న నుంచి అస‌లైన మ‌ణిర‌త్నాన్ని బ‌య‌టికి తీసుకొచ్చాడు. అయితే క‌థ విష‌యంలో మాత్రం జాగ్ర‌త్త ప‌డ‌లేక‌పోయాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌ను తీసిన క్లాసిక్స్ జోలికి వెళ్ల‌కూడ‌దు కానీ ఈ మ‌ధ్య కాలంలో మ‌ణి నుంచి వ‌చ్చిన ది బెస్ట్ ఔట్ పుట్ న‌వాబ్. సింపుల్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాను త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ర‌క్తి క‌ట్టించాడు మ‌ణిర‌త్నం. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో సీరియ‌స్ డ్రామా న‌డిప‌స్తూనే మ‌ధ్య‌లో కామెడీ వ‌ర్క‌వుట్ చేయ‌డం అనేది కేవ‌లం మ‌ణికే సాధ్యం.

మ‌రోవైపు వార‌సుల పోరు కూడా ఆస‌క్తిక‌రంగా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. వాళ్ల మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్స్ కానీ.. పిల్ల‌లు పెద్ద‌లు అనే తేడా కానీ ఉండ‌వు. అధికారం మ‌త్తులో ప‌డి మృగాల్లా ఉంటారు. వాళ్ల‌కు తోడుగా ఉండే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి జీవించాడు. అంద‌రి మ‌ధ్య ఓ కామ‌న్ థ్రెడ్ పెట్టి అద్బుతంగా క‌థ న‌డిపించాడు మ‌ణి. అయితే ఫ‌స్టాఫ్ లో ఉన్న రేస్ సెకండాఫ్ లో క‌నిపించ‌లేదు. క‌థ స్లో అయిపోయింది. అయితే ఆస‌క్తి మాత్రం త‌గ్గ‌లేదు. క్లైమాక్స్ లో కురుక్షేత్రాన్ని గుర్తు చేసి త‌న మార్క్ చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అర‌వింద్ స్వామి, శింబు, అరుణ్ విజ‌య్ మ‌ధ్య బాండింగ్ చాలా కొత్త‌గా అనిపిస్తుంది. ఇక విజ‌య్ పాత్ర‌ను మ‌ణి తీర్చిదిద్దిన వైనం కూడా చాలా బాగుంది.

న‌టీన‌టులు:
సినిమా నిండా స్టార్స్ ఉన్నారు. వ‌ర‌ద పాత్ర‌లో అర‌వింద్ స్వామి జీవించాడు. మొర‌టు పాత్ర‌కు ఈయ‌న ప్రాణం పోసాడు. ఇక త్యాగుగా అరుణ్ విజ‌య్ కూడా బాగున్నాడు. రుద్రగా శింబు త‌న ఆటిట్యూడ్ చూపించాడు. ముగ్గురు అన్నాద‌మ్ముల్లో శింబు పాత్ర కాస్త కొత్త‌గా అనిపిస్తుంది. చిత్ర పాత్ర‌లో జ్యోతిక ఉన్నంత‌లో బాగా చేసింది. పోలీస్ ఆఫీస‌ర్ గా విజ‌య్ సేతుప‌తి పాత్ర కీల‌కం. ఈయ‌నే క‌థ‌ను మ‌లుపు తిప్పుతాడు. అదితి రావ్ హైద్రీ.. ఐశ్వ‌ర్యా రాజేష్ ఉన్నంతలో ప‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:
ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ గురించి చెప్ప‌డానికి మాట‌లేం స‌రిపోవు. ఆయ‌న మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. పాట‌లు లేక‌పోయినా క‌థ‌తోనే కొన్ని పాట‌లు ఇచ్చాడు రెహ‌మాన్. ఆర్ఆర్ అదిరిపోయింది. ఎడిటింగ్ బాగుంది. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీకి పేరు పెట్టాల్సి ప‌నిలేదు. కేవ‌లం మ‌ణిర‌త్నం సినిమాల్లోనే చూసే కొన్ని షాట్స్ ఇందులోనూ క‌నిపించాయి. ద‌ర్శ‌కుడిగా మ‌ణిర‌త్నం త‌న స‌త్తా చూపించారు. అయితే క‌థ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే బాగుండేది. తుపాకి ప‌ట్టుకున్నోడు ఆ తూటాకే బ‌లైపోతాడు అని చూపించాడు ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా:
మ‌ణిర‌త్నం ఈజ్ బ్యాక్ విత్ ఏ గ్యాంగ్.

రేటింగ్  3/5

More Related Stories