English   

బ‌ర్త్ డే బాయ్ పూరీ జ‌గ‌న్నాథ్..   

Puri-Jagannadh
2018-09-28 11:49:10

టాలీవుడ్ లో ఎప్పుడూ సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ పూరీ జ‌గ‌న్నాథ్. ఎప్పుడు ప‌డ‌తాడో.. ఎప్పుడు లేస్తాడో ఎవ‌రికీ తెలియ‌దు. ఒక్కోసారి దారుణ‌మైన ఫ్లాపులిస్తాడు.. మ‌రోసారి ఇండ‌స్ట్రీ హిట్ కొడ‌తాడు. ప్ర‌స్తుతానికి పూరీ పొజిష‌న్ దారుణంగా ఉంది. ప‌డ‌టం లేవ‌డం ప‌రిగెత్త‌డం అనేది ఎప్పుడో అల‌వాటు చేసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌ర్ 28 ఆయ‌న పుట్టిన‌రోజు. 2000లో బ‌ద్రి సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు పూరీ. ఆ త‌ర్వాత సంచ‌ల‌న సినిమాలు చేసాడు. ఇడియ‌ట్.. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి.. శివ‌మ‌ణి.. పోకిరి.. దేశ‌ముదురు.. చిరుత‌.. బిజినెస్ మ్యాన్.. టెంప‌ర్ లాంటి సినిమాలు పూరి స్టామినా చూపించాయి. అయితే ఈ మ‌ధ్య పూరీ టైమ్ అస్స‌లు బాలేదు.. ప‌ర్స‌న‌ల్ గా.. ప్రొఫెష‌న‌ల్ గా కూడా. ఇటు సినిమాలు వ‌ర‌స‌గా ఫ్లాప‌వుతున్నాయి.. అటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోనూ ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ వివాదంలో ఇరుక్కుని బాగా డిస్ట‌ర్బ్ అయ్యాడు పూరీ. 

మ‌ళ్లీ ఇప్పుడు త‌న కెరీర్ గాడిన పెట్టుకోడానికి ట్రై చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ర‌చ్చ మ‌రిచిపోవాలంటే ఆయ‌న ముందున్న ఏకైక మార్గం హిట్ కొట్ట‌డం. అందుకే కొత్త సినిమా క‌థ‌ను క‌సిగా సిద్ధం చేసుకుంటున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఏ సినిమా చేస్తున్నాడు.. ఎవ‌రితో సినిమా చేస్తున్నాడు అనేది ఇప్పుడు చెప్ప‌లేదు కానీ త్వ‌ర‌లోనే క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో వ‌స్తానంటున్నాడు పూరీ. ఎలాగైనా హిట్ కొట్టి మ‌ళ్లీ తానేంటో నిరూపించుకోవాల‌ని చూస్తున్నాడు ఈ డైన‌మిక్ డైరెక్ట‌ర్. పూరీ టాలెంట్ పై ఇక్క‌డ ఎవ‌రికీ సందేహాల్లేవు.. కానీ టైమ్ బాలేన‌పుడు ఎవ‌రు మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? మ‌రోవైపు ఇండ‌స్ట్రీ కూడా ఈయ‌న క‌మ్ బ్యాక్ కోసం ఆస‌క్తిగా చూస్తుంది. ఒక్క హిట్ కొడితే పూరీని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. మ‌రి చూడాలిక‌.. ఈ బ‌ర్త్ డే బాయ్ ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories