English   

లెక్క స‌రిచేసిన నాని.. బాకీ తీర్చేసాడు.. 

Deva-Das
2018-09-28 13:21:09

అప్పు తీసుకోవ‌డం అంటే నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డ‌మే. తీర్చేవ‌ర‌కు టెన్ష‌న్ త‌ప్ప‌దు. ఇప్పుడు నాని కూడా ఇదే చేసాడు. ప్రేక్ష‌కుల నుంచి ఫ్లాప్ ను బాకీగా తీసుకున్నాడు ఈ హీరో. మూడేళ్లుగా వ‌ర‌స విజ‌యాల్లో ఉన్న నాని.. కృష్ణార్జున యుద్ధంతో గాడిత‌ప్పాడు. ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు బాకీ ప‌డ్డాడు నాని. అందుకే క‌చ్చితంగా మ‌రో హిట్ ఇచ్చి వాళ్ల బాకీ తీర్చాల‌ని ఫిక్సైపోయాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్పుడు అన్న‌ట్లుగానే దేవ‌దాస్ తో వ‌చ్చాడు. ఈ చిత్రానికి టాక్ బాగుంది.. క‌లెక్ష‌న్లు కూడా బాగానే వ‌చ్చాయి. అయితే రొటీన్ స్టోరీ కావ‌డం ఒక్క‌టే దేవ‌దాస్ కు మైన‌స్ గా క‌నిపిస్తుంది. 

అయినా ప‌ర్లేదు నాగార్జున‌, నాని లాంటి స్టార్స్ ఉన్నారు కాబ‌ట్టి క‌చ్చితంగా సినిమా గ‌ట్టెక్కేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు నిర్మాత‌లు. బ‌య్య‌ర్లు కూడా నాని స్టార్ ప‌వ‌ర్ ను బాగా న‌మ్మేస్తున్నారు. దానికితోడు కామెడీ కూడా ఉండ‌టంతో సినిమా ఈజీగా బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని ఆశిస్తున్నారు. నవాబ్ కు టాక్ బాగానే వ‌చ్చినా కూడా అది కుటుంబ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. అది గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా. తెలుగులో వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి. దాంతో ఈ వారం పెద్ద సినిమాలేవీ లేక‌పోవ‌డంతో పండ‌గ చేసుకుంటున్నారు దేవ‌దాస్. వ‌చ్చే వారం నోటా విడుద‌ల కానుంది కాబ‌ట్టి ఆ లోపే ఏం చేసినా కూడా లేదంటే విజ‌య్ వ‌చ్చేస్తాడు.. అంతా దున్నేస్తాడు..!                   

More Related Stories