English   

మణిరత్నం ఈజ్ బ్యాక్.. న‌వాబ్ కుమ్మేస్తుంది..

Mani-Ratnam
2018-09-28 14:35:48

ఆక‌లి వేస్తే సింహం గ‌డ్డి అయితే తిన‌దు క‌దా.. త‌న ఆహారం వ‌చ్చే వ‌ర‌కు వేచి చూస్తుంది. మ‌ణిర‌త్నం కూడా అంతే. ఒక‌ట్రెండు ఫ్లాపులు వ‌చ్చాయ‌ని ఆయ‌న్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు. స‌రైన సినిమా ప‌డిన రోజు ఆయ‌న స‌త్తా ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ప‌డింది. న‌వాబ్ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ త‌ప్పిస్తే.. అన్నిచోట్ల నుంచి అద్భుత‌మైన టాక్ వ‌చ్చింది. ఈ కాలంలో కూడా అధికారం కోసం త‌ల్లిదండ్రుల‌ను చంపే కొడుకులు ఉన్నారు.. అన్నాద‌మ్ముల్ని చంపుకుంటారా అని కొంద‌రు అడుగుతున్నారు కానీ ఉన్నార‌నే రోజూ మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇదే క‌థ‌ను తీసుకుని న‌వాబ్ చేసాడు మ‌ణిర‌త్నం. ఇప్పుడు ఈ చిత్రానికి టాక్ తో పాటు క‌లెక్ష‌న్లు కూడా బాగానే వ‌స్తున్నాయి.
 
తెలుగులో కాస్త త‌క్కువ‌గా ఓపెన్ అయినా త‌మిళ‌నాట మాత్రం దున్నేస్తుంది చెక్క చివంత వానం. అంటే ఆప‌రేష‌న్ రెడ్ స్కై అని అర్థం. అక్క‌డ స్టార్స్ అంతా క‌లిసి ఉండ‌టంతో పండ‌గ చేసుకుంటున్నారు అర‌వ అభిమానులు. ఇక మ‌ణిర‌త్నం కూడా చాలా ఏళ్ళ త‌ర్వాత త‌న స్టైల్ చూపించాడు.. త‌న మేకింగ్ తో ప‌డ‌గొట్టేసాడు. చివ‌ర్లో కురుక్షేత్రం ట‌చ్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాతో ఇన్నాళ్లూ త‌న అభిమానులు ఏది అయితే మిస్ అయ్యారో అది ఇచ్చాడు మ‌ణి. ఇప్పుడు ఈ మ‌ణి బాగా ప్ర‌కాశిస్తుంది. కాక‌పోతే ఒక‌ప్పుడు మ‌ణిర‌త్నం చేసిన క్లాసిక్స్ తో దీన్ని పోల్చ‌లేం కానీ కొన్నేళ్లుగా ఆయ‌న చేస్తున్న దారుణ‌మైన సినిమాల‌తో పోలిస్తే న‌వాబ్ మాత్రం చాలా క్వాలిటీ సినిమా. మ‌రి ఈ చిత్రంతో మ‌ణిర‌త్నం ఈజ్ బ్యాక్ అనొచ్చేమో..? 

More Related Stories