భయపడుతున్న అమీర్ ఖాన్..

నోటిమాట.. తుపాకి తూటా రెండు ఒక్కటే. రెండిట్లో ఏది జారినా వెనక్కి తీసుకోలేం. రెండేళ్ల కింద బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మొదటిది చేసాడు. అందుకే అనుభవించాడు.. ఇండియాలో అభద్రతా భావం ఎక్కువని.. ఇక్కడ రోజూ ఏదో ఓ అల్లరి జరుగుతూనే ఉంటుందని.. అసహనం పెరిగిపోతుందని.. ఇదంతా చూసి తన భార్య ఇండియా వదిలేసి వెళ్లిపోదామా అని తనతో అడిగిందని మొన్న ఓ ఇంటర్వ్యూలో అన్నాడు అమీర్. ఈ మాటలే అమీర్ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసాయి. ఇండియా వదిలి వెళ్లిపోవాలనే ఆలోచన అమీర్ ఖాన్ మనసులో ఉన్నందుకే ఇలాంటి మాటలొచ్చాయంటే అధికార బిజేపీ పార్టీ నాయకులు అమీర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అప్పుడు.
అప్పట్లో వర్మ కూడా ట్విట్టర్ లో అమీర్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసాడు. ఇండియన్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్న ముగ్గురు సూపర్ స్టార్లు ముస్లింలే అయినపుడు అసహనానికి చోటు ఎక్కడుందో అర్థం కావాట్లేదని బాగానే ఎక్కేసాడు. అప్పుడు ఈయనకు తగిలిన షాక్ ఇంకా గుర్తుంది. అందుకే ఇప్పుడు రామ్ మందిర్ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై స్పందించాలని అమీర్ ఖాన్ ను అడిగితే సింపుల్ గా ప్రశ్న దాటేసాడు. ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుకుందాం తర్వాత దీని గురించి చర్చించుకుందాం అనేసాడు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఇది జరిగింది. అమీర్ ను చూస్తుంటే అసహనం షాక్ ఇంకా వదిలినట్లు అనిపించలేదు. అందుకే సమాధానం చెప్పడానికి కూడా భయపడ్డాడు మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్.