English   

అర్జున్ రెడ్డిలో ప్రీతీ కంటే బోల్డ్ గ నటించడానికి రెడీగా ఉందా?

Kiara Advani Will do Bold Scenes With Shahid Kapoor
2018-09-28 16:10:01

అర్జున్ రెడ్డి అనేది సినిమా కాదు.. అదో బ్రాండ్. యూత్ కు ఈ చిత్రం ఎంత‌లా ఎక్కేసిందంటే.. ప‌గ‌లు రాత్రి అప్ప‌ట్లో అర్జున్ రెడ్డి ధ్యాస‌లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా విజ‌య్దేవ‌ర‌కొండ‌ను అర్జున్ రెడ్డి అంటారే కానీ సొంత పేరుతో పిల‌వ‌డం మ‌రిచిపోయారు. అంత‌గా ఫేమ‌స్ అయ్యాడు ఈ సినిమాతో. ఇక ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది.అక్క‌డ షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా మొద‌లై నెల రోజులు దాటేసింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో భరత్ అనే నేనులో మహేష్ బాబుతోరొమాన్స్ చేసిన కియారా అద్వాని హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది. ఇన్నాళ్లూ అనుమానాలు మాత్ర‌మే ఉండేవి. ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. తాజాగా ఈ చిత్రంచేయ‌బోతున్న‌ట్లు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది కియారా. త‌న‌కు అర్జున్ రెడ్డి సినిమా అంటే చాలా ఇష్టం అని.. అలాంటి పాత్ర చేయ‌డం బాగుంటుంద‌ని చెప్పింది కియారా
అద్వాని.

Kiara Advani Shahid Kapoor Urvasi

అయితే ఇందులో న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఫుల్ రొమాన్స్ ఉంటుంది.. బాలీవుడ్ కాబ‌ట్టి డోస్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అన్నింటికీ సై అనే ముందుకొచ్చింది కియారా. ఈ పాత్ర‌లో న‌టించిన త‌ర్వాత అదో ర‌కం ఇమేజ్ రావ‌డం ఖాయం. అది తెలిసినా సై అనేసింది ఈ బ్యూటీ. అయినా ల‌స్ట్ స్టోరీస్ లో కియారా రెచ్చిపోయిన తీరు చూసిన త‌ర్వాత ఎలాంటి పాత్ర‌కైనా ఆమె రెడీ అని అర్థ‌మైపోతుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ముద్దులు పెట్ట‌డం అస‌లు ఆమెకు లెక్కే కాదు. మొత్తానికి షాహిద్ క‌పూర్ తో షూటింగ్ కు రెడీ అవుతుంది కియారా. త్వ‌ర‌లోనే సెట్ లో అడుగు పెట్ట‌నుంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో అజార్ బైజాన్ లో షూటింగ్ చేస్తుంది ఈ భామ‌. మ‌రి చూడాలి‌.. అర్జున్ రెడ్డి రీమేక్ లోకియారా అద్వాని ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories