English   

దేవదాస్ లు దుమ్మురేపారు

Devadas
2018-09-28 18:05:22

అక్కినేని నాగార్జున, నాని కలిసి నటించిన సినిమా దేవదాస్. ఈ గురువారం విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ జనరల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారిని మాత్రం ఈ సినిమా బానే ఆకట్టుకుంటోంది. అందుకే ఫస్ట్ డే టాక్ తో సంబంధం లేకుండా వాల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ సాధించింది దేవదాస్. వాల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ నే సాధించింది. నిజానికి నాగ్ అండ్ నాని కాంబోలో సినిమా అంటే కాస్త యాక్షన్ మరికాస్త హ్యూమర్ ఇంకాస్త సెంటిమెంట్ అంటూ కంప్లీట్ ఎంటర్టైనర్ ను ఆశించారు ఆడియన్స్. కానీ వీళ్లు మాత్రం కేవలం కామెడీనే అందించారు. ఆ విషయం కొంత డిజప్పాయింట్ చేసినా ఆ కామెడీని ఆస్వాదించగలిగితే దేవదాస్ టైమ్ పాస్ చేస్తాడు. అందుకే ఈ కలెక్షన్స్ అనుకోవచ్చు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాత. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నానికి జోడీగా రష్మిక మందన్నా నటించారు. నాగ్ అండ్ నాని కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సీన్ ఆడియన్స్ ను మాగ్జిమం ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా  ప్రపంచ వ్యాప్తంగా దేవదాస్ ఫస్ట్ డే  కలెక్షన్స్  ఎలా ఉన్నాయో చూద్దాం. 

నైజాం     : 1.68కోట్లు
సీడెడ్     : 0.73 లక్షలు
నెల్లూర్     : 0.19 లక్షలు
గుంటూర్     : 0.52లక్షలు
కృష్ణ     : 0.32 లక్షలు 
వెస్ట్ గోదావరి   : 0.26 లక్షలు
ఈస్ట్ గోదావరి  : 0.39 లక్షలు 
యూ.ఏ     : 0.58 లక్షలు 

దీంతో టోటల్ ఫస్ట్ డే కలెక్షన్స్ షేర్స్ లో 4 కోట్ల 67లక్షలు .. ఇక 
కర్ణాటక    : 0. 28 లక్షలు 
రెస్ట్ ఆఫ్ ఇండియా:  0.42లక్షలు 
యూఎస్    : 1.20 కోట్లు 

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా దేవదాస్ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ షేర్స్ రూపంలో ... 6కోట్ల 57లక్షలు..
మరోవైపు నవాబ్ కాస్త వీక్ గా ఉన్నాడు కాబట్టి.. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరో వారం వరకూ ఖచ్చితమైన ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాలు కూడా స్ట్రాంగ్ గా ఏం లేవు. సో.. దేవదాస్ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. 

More Related Stories