English   

బాబోయ్.. సమంత ఎంత బూతు వాడింది

Samantha-chaitanya
2018-09-28 18:40:50

సమంత.. నిన్నటి వరకూ స్టార్ హీరోయిన్.. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అనుకోండి. కానీ ఇప్పుడు అక్కినేని సమంత. అందుకే అభిమానులు ఆమెను సంప్రదాయంగా చూడాలనుకుంటున్నారు. కానీ అమ్మడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అభిమానుల ఆశలకు పూర్తిగా డిఫరెంట్ గా వెళుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు. సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ సమంత డ్రెస్సింగ్ పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉంది. నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ముందు నుంచీ యమా యాక్టివ్ గా ఉండే శామ్.. ఆ వెకేషన్ కు సంబంధించిన ఫోటోస్ ను సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తోంది. వీటిలో కొన్ని సెమీ న్యూడ్ గానూ ఉన్నాయి. మరికొన్ని బికినీస్ తో ఇంకొన్ని ఓవర్ ఎక్స్ పోజింగ్ తో కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్స్ ఆమె వస్త్రధారణపై మండిపడుతున్నారు.

అయితే ఇలాంటి వాటిని లైట్ తీసుకోని శామ్.. ఆ అందరికీ దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చింది. అది కూడా అత్యంత బూతుగా చెప్పుకునే పదానికి ‘సింబల్’ వాడి. మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్ లో ఎక్కువగా వాడే ఈ మిడిల్ ఫింగర్  ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘‘పెళ్లి తర్వాత కూడా నేనెలా బ్రతకాలో నాకు నేర్పిస్తోన్న వాళ్లందరికీ’’ అంటూ ఓ లైన్ కూడా యాడ్ చేసింది. మొత్తంగా సమంత చూపిన మిడిల్ ఫింగర్ కు ఎవరికి ఎక్కడ కాలిందో కానీ.. మళ్లీ ఈ ఫింగర్ పైనా ట్రోల్స్ వస్తాయని వేరే చెప్పక్కర్లేదేమో. కానీ అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి ఇంత షార్ట్ టెంపర్ గా అలాంటి ఫోటో పోస్ట్ చేయకుండా ఉండాల్సింది అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 

More Related Stories