English   

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కో గూడ్ న్యూస్

Aravinda-sametha
2018-09-28 19:54:57

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అరవింద సమేత వీరరాఘవ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల కాబోతోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ పాటలు స్లో పాయిజన్ లా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. అంటే వినగానే ఆకట్టుకోకపోయినా వినగా వినగా అలరిస్తున్నాయంటున్నారు. అయితే ఈ నెల 20న ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అప్పటికి హరికృష్ణ మరణించి నెల కూడా కాలేదు కాబట్టి.. పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే అభిమానుల్లో ఈ విషయమై కొంత నిరుత్సాహం ఉంది. మరోవైపు సినిమాకూ ప్రమోషన్ కావాలి కదా. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం డేట్ కూడా సిద్ధం చేసుకున్నారు.

అక్టోబర్ 2న అరవింద సమేత వీరరాఘవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఈ ఫంక్షన్ ఎక్కడ నిర్వహిస్తారు.. అనే వేదిక ఇంకా తేలలేదు. మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యుల్లో కొందరు కీలక వ్యక్తులు అటెండ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాకపోయినా బాలయ్య ఒక్కడు వచ్చినా చాలా లెక్కలు మారతాయని చెప్పొచ్చు. అదే సమయంలో రాకపోయినా రకరకాల ఊహాగానాలూ వస్తాయి. వీళ్లు ఎలాగూ అవన్నీ పట్టించుకోరు కాబట్టి.. ఫంక్షన్ యధావిధిగా సాగిపోతుంది. అయితే ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ కు మాత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ స్ట్రాంగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు టాక్. 

More Related Stories