English   

 విశాల్ సినిమాపై  నెగెటివ్ కమెంట్స్ ...?

Sandakozhi 2-trailer
2018-09-28 21:50:21

నల్లనయ్య విశాల్ హీరోగా నటించిన సండాకోళై (పందెంకోడి) సినిమా పదమూడేళ్ల క్రితం వచ్చింది. ఈ సినిమా మనోడికి కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ మూవీ ఇచ్చిన బ్రేక్ తో ఇప్పటి వరకూ బ్రేక్ లేకుడా దూసుకుపోతున్నాడు విశాల్. అప్పట్లో ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ అల్లరి గురించే ఐదారేళ్లు చెప్పుకున్నారు. ఆ రేంజ్ లో తన అల్లరి కామెడీ ఉంటాయి. ఇక కాలేజ్ స్టూడెంట్ గా విశాల్ కూడా యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. రాజ్ కిరణ్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీ తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటికి మన దగ్గర ‘సీమ కథల’ ట్రెండ్ నడుస్తుండటంతో పందెంకోడి బాక్సాఫీస్ బరిలో గెలిచింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ తోవస్తున్నాడు విశాల్. ఈ సీక్వెల్ తనకు 25వ సినిమా కూడా కావడం విశేషం. ఇక అప్పటి దర్శకుడు లింగుస్వామే ఈ సీక్వెల్ కూ దర్శకుడు. 

కొన్నాళ్ల క్రితం విడుదలైన సండాకోళై -2 కు మంచి స్పందనే వచ్చింది. కానీ లేటెస్ట్ గా మరో ట్రైలర్ విడుదల చేశారు. కానీ దీనిపై నెగెటివ్ కమెంట్స్ వస్తున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా లేదని చాలామంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాపైనా ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రైలర్ లోనే సగానికిపైగా పాత సినిమా ఆర్ఆర్ నే వాడావు.. నీ దగ్గర సరుకైపోయిందా అని కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు టీజర్ లో విశాల్ టైమ్ స్పేస్ తక్కువగా ఉందనీ.. విలన్ పాత్రలో నటించిన వరలక్ష్మిపైనా కామెంట్స్ ఉన్నాయి. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ ట్రైలర్ లో చేసిన ‘టివిఎక్స్ ఎల్ సెల్ఫీ’పైనా విపరీతమైన జోకులు వేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 18న దసరా కానుకగా తెలుగు, తమిళ్ లో ఒకేసారి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాడు విశాల్. ఇక పందెంకోడి -2 తెలుగు వెర్షన్ రెండో ట్రైలర్ ను ఈ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేయబోతున్నారు. మరి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 

More Related Stories