English   

‘నోటా’తమిళ్ సెన్సారింగ్ అయిపోయింది.

NoTA-Tamil-Censor
2018-09-28 22:25:47

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘నోటా’. ఈ మూవీతో కోలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడీ అర్జున్ రెడ్డి. రీసెంట్ గా గీత గోవిందంతో తిరుగులేని హిట్అందుకున్న విజయ్ దేవరకొండ ఈ మూవీతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు. ఓవర్శీస్ లో కూడా టాప్ టెన్ లీగ్ లోజాయిన్ అయ్యాడు. ఇక అలాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి నోటాపై భారీ అంచనాలే ఉంటాయి. అయితే ఈ సారి కూడా వాటిని అందుకోవడం అంత ఈజీ కాదు. బట్ రెండు భాషల్లోనూ రూపొందిన ఈ మూవీ విజయ్ దేవరకొండకు నిజంగానే ఓ ఛాలెంజ్. తమిళ్ టాప్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా నిర్మింరిన ఈ మూవీకి ఆనందర్ శంకర్ దర్శకుడు. మెహ్రీన్ కౌర్ విజయ్ దేవరకొండకు జంటగా నటించింది. కాకపోతే ఈ పాత్ర రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లా ఉండదు అంటున్నారు. ఇక లేటెస్ట్ గా నోటా తమిళ్ సెన్సార్ పూర్తయింది. అక్కడి నుంచి ఈ మూవీకి  క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ వచ్చింది. అంటే అర్జున్ రెడ్డి తర్వాత చేసిన గీత గోవిందం కంటే కూడా క్లీన్ గా ఉందన్నమాట. మొత్తంగా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్నఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తెలుగులో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. త్వరలోనే రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఫంక్షన్స్  నిర్వహించబోతున్నాడు. అలాగే అటు తమిళ్ లో కూడా ప్రమోషన్స్ పై గట్టిగా కాన్ సెంట్రేట్ చేస్తున్నాడు. సో.. ఇక అనుకున్నట్టుగానే నోటా అక్టోబర్ 5నే విడుదల కాబోతోంది. 

More Related Stories