English   

వెండితెరపై ‘సర్జికల్ స్ట్రైక్స్’...?

URI-Official-Teaser
2018-09-29 11:34:16

రెండేళ్లుగా ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రస్తావించిన మాట ‘సర్జికల్ స్ట్రైక్స్’.. అంటే శతృవు స్థావరంలోకి రహస్యంగా వెళ్లిపోయి.. అందరినీ అంతమొందించి మళ్లీ ఏ ఒక్క ప్రాణం పోకుండా సేఫ్ గా తిరిగి రావడం. మామూలుగా అన్ని దేశాల సైన్యాల్లో ఇవి కామన్. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దీన్నో అతిశయోక్తిలా చెప్పుకుంటోంది. ప్రభుత్వం మేటర్ అలా ఉంచితే.. ఇప్పుడీ ఇన్సిడెంట్ పై ఓ సినిమా రాబోతోంది. పాకిస్తాన్ సైన్యం 2016డిసెంబర్ 18న కశ్మీర్ లోని ‘యూఆర్ఐ’ బేస్ క్యాంప్ వద్ద దొంగ దెబ్బ తీసి మన సైనికులను 19మందిని పొట్టన బెట్టుకుంది. చాలా దశాబ్దాలుగా ఇంత దారుణమైన దాడి మన సైన్యం పై జరగడం ఇదే ప్రథమం. దీనికి ప్రతీకారంతో రగిలిపోయిన మన సైన్యం పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ కు దిగి వారి భూభాగంలోనే కొన్ని క్యాంప్స్ ను నాశనం చేస్తుంది. ఇదే కథాంశాన్నే సినిమాగా మలిచారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది. 

సంజూ సినిమాలో సంజయ్ దత్ ఫ్రెండ్ గా అద్భుతమైన మార్కులు కొట్టేసిన విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అచ్చంగా ఓ రియలిస్టిక్ మూవీ చూస్తోన్న అనుభూతి టీజర్ కే కలుగుతుంది. ముఖ్యంగా చనిపోయిన సైనికుడి భార్య, కూతురు ఆయన నివాళి అర్పించే సీన్ టీజర్ లోనే గుండె బరువెక్కించింది. ఆదిత్య ధార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రోనీ స్కూవాలా నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని జనవరి 11న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కాకపోతే టీజర్ ను బట్టి ఇది ఖచ్చితంగా ఓ గొప్ప దేశభక్తి కథాంశం అని అర్థమౌతోంది. ఆ స్థాయిలోనే తెరకెక్కించగలిగితే కమర్షియల్ గానూ మంచి విజయం దక్కుతుంది. 

More Related Stories