English   

క్రిష్ వదిలేసిన కంగన బిజీగా ఉంది

Kangana Ranaut Doing Manikarnika Shooting Without Director Krish
2018-09-29 13:49:09

డైరెక్టర్ క్రిష్ రెండో బాలీవుడ్ సినిమా మణికర్ణిక షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైనా కూడా రీ షూట్లతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది కంగన రనౌత్. కొన్ని నెలల కింద వారణాసి ఒడ్డున ఈ సినిమా ముహూర్తం జరిగింది. ఝాన్సీ లక్ష్మీభాయ్ జన్మించిన గడ్డపైనే మణికర్ణిక షూటింగ్ మొదలు పెట్టాడు క్రిష్. నాటి నుంచి నేటి వరకు సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసాడు. మధ్యలో కంగన రనౌత్ కు క్రిష్ తో గొడవలు రావడంతో ఆయన తప్పుకున్నాడు. ఆ తర్వాత నిర్మాత కూడా తప్పుకున్నాడు. అప్పట్నుంచీ ఈ ప్రాజెక్ట్ ను కంగన హ్యాండిల్ చేస్తుంది.

Kangana Ranaut Manikarnika Teaser Releasing on October 2nd

1828లో కాశీలో జన్మించిన ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కంగన రనౌత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ మణికర్ణిక కోసం బాలీవుడ్ లో చాలామంది దర్శకులను వదిలేసి మన క్రిష్ ను ఎంచుకుంది. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర లుక్ విడుదలైంది. గాంధీజయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. 2019 జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. శంకర్ ఎహసాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆ మరుసటి రోజు హృతిక్ రోషన్ సూపర్ 30 విడుదల కానుంది. అయినా కూడా మాజీ ప్రియుడికి పోటీగా తన సినిమా తీసుకొస్తుంది కంగన.

 

More Related Stories