English   

ముగ్గుర‌మ్మాయిల‌తో అంటున్న ర‌వితేజ‌.. 

Ravi-Teja
2018-09-29 14:47:42

అవును.. బ‌న్నీ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో అంటే ర‌వితేజ ముగ్గుర‌మ్మాయిల‌తో అంటున్నాడు. ఈయ‌న ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో మూడు భిన్న‌మైన పాత్ర‌లు చేసిన ర‌వితేజ‌.. నెక్ట్స్ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో జోడీ క‌ట్ట‌బోతున్నాడు. అస‌లు ఈయ‌న ఎంచుకుంటున్న క‌థ‌లు కూడా చాలా కొత్త‌గా ఉంటున్నాయి. కెరీర్ మొత్తంలో ఆయ‌న కాస్త కొత్త‌గా ట్రై చేద్దాం అని ముందడుగు వేసిన ప్ర‌తీసారి చ‌తికిల ప‌డ్డాడు. నాటి నా ఆటోగ్ర‌ఫ్ నుంచి నిన్న‌మొన్న‌టి సారొచ్చారు వ‌ర‌కు ర‌వితేజ‌కు ప్రయోగాలు పెద్ద‌గా ప‌డ‌లేదు. అయితే ఇప్పుడు ఏ ధైర్య‌మో ఆయ‌న్ని ముందుకు న‌డిపించింది. ఇప్పుడు విఐ ఆనంద్ తో ఈయ‌న ఓ కొత్త సినిమా చేయ‌బోతున్నాడు. కొత్త సినిమా అంటే కొత్త‌క‌థ అని అర్థం. 

ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌ర్క‌వుట్ అయిపోయింది. నేల‌టికెట్ ఫేమ్ రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో న‌న్ను దోచుకుందువ‌టే ఫేమ్ న‌భా న‌టేష్ ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. మ‌రో ఇద్ద‌రు భామ‌ల కోసం చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. టైగ‌ర్.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ.. ఒక్క‌క్ష‌ణం లాంటి డిఫెరెంట్ సినిమాల త‌ర్వాత ర‌వితేజ‌తో సినిమా ఓకే చేయించుకున్నాడు ఆనంద్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న కెరీర్ లో ఎప్పుడూ చేయ‌ని కొత్త జోన‌ర్ లో ఈ చిత్రం రానుంద‌ని తెలుస్తుంది.ఈ చిత్రం పూర్తిస్థాయి అడ్వంచ‌రస్ డ్రామా అని వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిర్తే న‌వంబ‌ర్ లో ఆనంద్- ర‌వితేజ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలి.. ఈ కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా రానుందో..?

More Related Stories