English   

‘షకలక శంకర్’ని ఖైదీ చేశారు..?

Shakalaka-Shankar
2018-09-29 15:21:05

కాస్త ఓవర్ అనిపించినా కొన్ని విషయాలుకామెడీగానే చూడాలి. ఫలానా పేరు ఫలానా వాళ్లే పెట్టుకోవాలన్న రూలేం లేదు కాబట్టి.. కొన్ని విషయాలు అన్నిటికీ అప్లై  చేయొద్దు. అలా చేయలేదు కాబట్టే ఈ కమెడియన్ ను ఖైదీని చేశారు. జబర్దస్త్ లో శ్రీకాకుళం స్లాంగ్ తో ఫేమ్అయిన షకలక శంకర్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా బిజీ అయ్యాడు. మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా ఎదుగుతున్న టైమ్ లో మనోడు సడెన్ గా హీరో అయ్యాడు. అంతేనా.. ఇకపై హీరోగానే చేస్తానంటూ శపథాలు చేశాడు. అలా శపథం చేసి రీసెంట్ గా ‘శంభో శంకర’ అంటూ వచ్చాడు. కానీ మనోడు కమెడియన్ లా కాక ఓ యాక్షన్ హీరోలా బిల్డప్ ఇచ్చేసరికి ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అంతకు ముందు ప్రారంభం అయిన కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమా పేరేంటో తెలుసా.. ‘ఖైదీ’.

చిరంజీవిని సుప్రీమ్ హీరోగా మార్చిన సినిమా ఖైదీ. ఈ సినిమా తర్వాతే ఆయన దశ తిరిగింది. అలాంటి టైటిల్ ను రిపీట్ చేయడం అంటే సాహసం. కానీ షకలక శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హనుమాన్ కృష్ణ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. దసరా నుంచి షూటింగ్ ప్రారంభిస్తారట. అయితే ఖైదీ అనే టైటిల్ కు ఎలాంటి బ్యాడ్ ఇమేజ్ రాకుండా.. అలాంటి టైటిల్ పెట్టుకున్న తమను ఎవరూ తిట్టుకోకుండా అద్భుతంగా ఈ కథ ఉండబోతోందని ప్రకటించింది మూవీ టీమ్. అది నిజమా కాదా అనేది పక్కన బెడితే షకలక శంకర్ కు ఇప్పుడు మాస్ ఇమేజ్ అవసరమా.. అలాంటి మోజులో పడిపోయి.. ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకున్న కమెడియన్స్ ను ఎంతమందిని చూళ్లేదు..

More Related Stories