English   

నోటా హిట్టైతే బన్నీ ఏం చేస్తాడో..? 

Allu-Arjun-NOTA
2018-09-29 16:28:54

నోటాకు బ‌న్నీకి ఏంటి సంబంధం..? ఆ సినిమా హిట్టైతే ఏంటి.. ఫ్లాప్ అయితే ఏంటి..? అస‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాతో ఏంటి బ‌న్నీకి లింక్ అనుకుంటున్నారా..? ఉంది.. ఇలాంటి లింక్ ఎప్పుడూ ఒక‌టి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కానీ నోటా హిట్ అయిందంటే బ‌న్నీ క‌చ్చితంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ చిత్రంలో ముందు అనుకున్న హీరో ఈయ‌నే కాబ‌ట్టి. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం. దీనిపై ఉన్న అంచ‌నాలు.. ఆస‌క్తి చూస్తుంటే విజ‌య్ మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు ఆనంద్ శంకర్ ఇరుముగ‌న్ త‌ర్వాత ఈ క‌థ‌ను రాసుకుని బ‌న్నీకి చెప్పాడు. అయితే ఎందుకో తెలియ‌దు కానీ ఈ క‌థ త‌న ఇమేజ్ కు స‌రిపోదు అని బ‌న్నీ భావించి వదిలేసుకున్నాడు. ఆ టైమ్ లో బ‌న్నీ కాకుండా ఆనంద్ మ‌దిలో మెరిసిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎలాగూ అర్జున్ రెడ్డితో మ‌నోడికి త‌మిళ‌నాట కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది. ఇలాంటి టైమ్ లో ఆనంద్ శంక‌ర్ క‌థ న‌చ్చ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు విజ‌య్. ఇప్పుడు కానీ నోటా సంచ‌ల‌నం సృష్టించిందంటే క‌చ్చితంగా బ‌న్నీ ఓ హిట్ సినిమా కోల్పోయిన‌ట్లే. అన్న‌ట్లు గీత‌గోవిందం కూడా ముందు బ‌న్నీకోసం అనుకున్నాడు ప‌రుశురామ్. ఆయ‌న కాద‌న్న త‌ర్వాతే విజ‌య్ వ‌చ్చాడ‌నే వార్త‌లు ఉన్నాయి.

More Related Stories