English   

వేటకత్తికి మీసం పెడితే.. ఎన్టీఆర్ అట..

Aravindha-Sametha
2018-09-29 17:29:18

అరవింద సమేతుడు దూకుడు పెంచాడు. రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్నా కొద్దీ వేగంగా పావులు కదుపుతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. రామ్ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ‘వేటకత్తికి మీసం పెడితే నాకులాగే ఉంటాది’ అంటూ అద్భుతమైన పద ప్రయోగంతో మొదలైన ఈ పాట నిజంగానే సినిమాలో హుషారు పెంచే పాటగా అనిపిస్తోంది. అయితే ఈ పాటను ముందుగా ఓ పాత సినిమా పాటతో మొదలుపెట్టడం విశేషం. 

1963 లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ శ్రీ కృష్ణార్జున యుద్ధంలోని వేయిశుభములు కలుగు నీకు.. పోయిరావే మరదలా.. అంటూ సాగే పాటతో ఈ వేటకత్తి పాట మొదలవుతుంది.  దలేర్ మెహందీ, అంజనా సౌమ్య కలిసి పాడిన ఈ పాటకు రీసెంట్ గా జానీ మాస్టర్ స్టెప్స్ అందించాడు.. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అంచనాలకు తగ్గట్టుగా లేకపోయినా.. సినిమాలో బావుంటాయనే టాక్ ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడం కోసం ఎంటైర్ యూనిట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టింది. 

ఇక మొదట్లో త్రివిక్రమ్ పై డౌట్స్ వచ్చినా.. ఆయన ఒక ఫ్లాప్ ఇచ్చిన ప్రతిసారీ ఆ తర్వాతి సినిమాతో భారీ హిట్ కొడతాడనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే యంగ్ టైగర్ పవర్ కూడా యాడ్ అయితే ఈ సినిమా మరో రేంజ్ కు వెళుతుందని చెప్పొచ్చు. మొత్తంగా అక్టోబర్ 11న విడుదల కాబోతోన్న అరవింద సమేత వీరరాఘవకు దసరా శెలవులు భారీగా కలిసి రానున్నాయి. 

More Related Stories