English   

కమల్ ఆశీస్సులు తీసుకున్న విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda
2018-09-29 19:56:53

విజయ్ దేవరకొండ.. ఈ మధ్య కాలంలో ఈ పేరు వినిపించకుండా సినిమా వారికి ఏ రోజూ పూర్తి కావడం లేదు. ఆస్థాయిలో క్రేజ్ సంపాదించాడీ యంగ్ సైరన్. లక్కీగా హిట్లు కాకుండా టాలెంట్ తో విజయాలు అందుకుంటోన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో నయా స్టార్. కోలీవుడ్ లో కాబోయే స్టార్.. యస్.. నిజంగానే మనోడిలో ఆకేపబిలీటీస్ ఉన్నాయి. లేకపోతే మామూలుగా తెలుగు నటులను ఇక్కడ తప్ప ఎక్కడా పొగడని తమిళ సీనియర్స్ కూడా విజయ్ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా కట్టప్ప సత్యరాజ్ సైతం మనోడి ప్రతిభకు ఫిదా అయిపోయి ఓపెద్ద లెటర్ లాంటి ప్రశంసలే కురిపించాడు. 

మరోవైపు చాలా స్ట్రాటజిక్ గా తన నోటా మూవీ ప్రమోషన్స్ చేస్తోన్న విజయ్ దేవరకొండ ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అలసిపోవడం లేదు. పైగా ఈ సినిమా బై లింగ్వుల్ కాబట్టి.. రెండు భాషల్లో, మూడు రాష్ట్రాల్లో(రెండు తెలుగు, తమిళ) ప్రమోషన్స్ చేయాలి. అయినా ఆగకుండా దూసుకుపోతున్నాడు. 

నిన్న తెలుగు ఇంటర్వ్యూస్ ఇచ్చిన విజయ్ లేటెస్ట్ గా తమిళ్ లో మొదలుపెట్టాడు. ఈ సందర్బంగా అతను లోకనాయకుడు కమల్ హాసన్ ను సైతం కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. మామూలుగా ఇలాంటి టాలెంట్ అంటే కమల్ కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే విజయ్ కలుస్తాననగానే వెంటనే ఓకే చెప్పాడట. మొత్తంగా విజయ్ చాలా తెలివిగా, మరింత ఉత్సాహంగా కెరీర్ తీర్చి దిద్దుకుంటోన్న తీరు చూసి వారస హీరోలు కొంతైనా నేర్చుకోవాల్సి ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. 

More Related Stories