English   

ఓవ‌ర్సీస్ లో నవాబ్ గిరి

Mani Ratnam's Nawab Overseas Two Days Collections
2018-09-30 13:06:14

చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మ‌ణిర‌త్నం సినిమా కుమ్మేస్తుంది. ఆయ‌న సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ్యాజిక్ చేస్తుంటే చూడాల‌ని అభిమానులు ఎన్నో ఏళ్లుగా చూస్తున్నారు. ఇన్నాళ్ల‌కు వాళ్ల క‌ల నెర‌వేరింది. ఇప్పుడు విడుద‌లైన న‌వాబ్ ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ కుమ్మేస్తుంది. ఈ చిత్రం అక్క‌డ రెండు రోజుల్లోనే 4 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసింది. అధికారం కోసం అన్నాద‌మ్ములు ప‌డే ఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాను ఎమోష‌న్ లెస్ గా తెర‌కెక్కించాడు మ‌ణిర‌త్నం. దానికి ఆయ‌న మాస్ట‌ర్ స్క్రీన్ ప్లే తోడైంది. అందుకే ఇప్పుడు న‌వాబ్ గిరి మొద‌లైంది. పైగా ఈ చిత్రానికి స్టార్ ప‌వ‌ర్ కూడా బాగానే ప‌నికొస్తుంది. ముఖ్యంగా అర‌వింద్ స్వామి, శింబు, విజ‌య్ సేతుప‌తి ఫ్యాన్స్ సినిమా చూసి పండ‌గ చేసుకుంటున్నారు.

తెలుగులో నవాబ్ కు యావ‌రేజ్ క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి కానీ త‌మిళ‌నాడుతో పాటు ఓవ‌ర్సీస్ లో మాత్రం సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. మ‌ణిర‌త్నం కూడా చాలా ఏళ్ళ త‌ర్వాత త‌న స్టైల్ చూపించాడు.. త‌న మేకింగ్ తో ప‌డ‌గొట్టేసాడు. చివ‌ర్లో కురుక్షేత్రం ట‌చ్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాతో ఇన్నాళ్లూ త‌న అభిమానులు ఏది అయితే మిస్ అయ్యారో అది ఇచ్చాడు మ‌ణి. ఇప్పుడు ఈ మ‌ణి బాగా ప్ర‌కాశిస్తుంది. కాక‌పోతే ఒక‌ప్పుడు మ‌ణిర‌త్నం చేసిన క్లాసిక్స్ తో దీన్ని పోల్చ‌లేం కానీ కొన్నేళ్లుగా ఆయ‌న చేస్తున్న దారుణ‌మైన సినిమాల‌తో పోలిస్తే న‌వాబ్ మాత్రం చాలా క్వాలిటీ సినిమా. మొత్తానికి ఇన్నాళ్ల‌కు ఆయ‌న ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కింది.
 

More Related Stories