English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్ర‌కంప‌న‌లు

Vijay Deverakonda Started NOTA Movie Tamil Promotion
2018-09-30 14:51:41

విజ‌య్ విజ‌య్ విజ‌య్.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఈయ‌న సినిమాలు సృష్టిస్తున్న సంచ‌ల‌నం అలా ఉన్నాయి మ‌రి. ఒక్క‌టి రెండు కాదు.. మొన్నొచ్చిన గీత‌గోవిందం అయితే ఏకంగా 125 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప‌క్క‌నున్న త‌మిళనాడు.. ఆ ప‌క్క‌న  క‌ర్ణాట‌క‌ల్లోనూ విజ‌య్ క్రేజ్ మామూలుగా లేదు. మ‌నోడి సినిమాకు చెన్నైలో బ్ర‌హ్మాండ‌మైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఏకంగా మ‌న స్టార్ హీరోలు కూడా త‌ల‌దించుకునేలా అక్క‌డ కుమ్మేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చెన్నైలో ఏకంగా 6.2 కోట్లు వ‌సూలు చేసింది గీత‌గోవిందం తెలుగు వ‌ర్ష‌న్. ఈ వ‌సూళ్లు ఇప్పుడు ఆనంద్ శంక‌ర్ నోటా సినిమాకు హెల్ప్ కానున్నాయి.

Vijay Devarakonda Kamal Haasanనోటా ద్విభాషా చిత్రం. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమాకు అక్క‌డ ఓపెనింగ్స్ అదిరిపోవ‌డం ఖాయం. ప్ర‌స్తుతం చెన్నైలోనే ఉన్నాడు విజ‌య్. అక్క‌డే బిగ్ బాస్ ఫైన‌ల్ కు అతిథిగా వెళ్లాడు ఈయ‌న‌. దాంతోపాటు క‌మ‌ల్ తో ఫోటో దిగి త‌న సినిమా ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ బిగ్ బాస్ కు ప్ర‌మోష‌న్ కోసం వెళ్లిన తొలి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండే. స్వామి కార్యం.. స్వ‌కార్యం అన్న‌ట్లు బిగ్ బాస్ 2 ఫైన‌ల్ కు వెళ్లి ట్రోఫీ ఇచ్చి.. అలాగే త‌న సినిమా ప్ర‌మోష‌న్ చేసుకున్నాడు. ప‌నిలో ప‌నిగా అక్క‌డే ఉండి ఇంట‌ర్వ్యూలు కూడా పూర్తి చేస్తున్నాడు ఈయ‌న‌. నోటా హిట్టైతే క‌నీసం 30 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. మొత్తానికి మ‌రి చూడాలి త‌మిళ‌నాట తెలుగోడి జెండా ఎలా ఎగ‌ర‌బోతుందో..?Vijay Devarakonda NOTA Still

More Related Stories