English   

కౌశ‌ల్ ఆర్మీ చేసి చూపించారుగా.. 

Kaushal
2018-10-01 10:27:29

తొలి సీజ‌న్ తో పోలిస్తే బిగ్ బాస్ రెండో సీజన్ ఇప్ప‌టికీ వెన‌క‌బడే ఉంది. రేటింగ్స్ విష‌యంలో ఒక్క‌సారి కూడా ఎన్టీఆర్ షోను టచ్ చేయ‌లేక‌పోయింది ఈ సీజ‌న్. ఇప్పుడు షో పూర్తైన త‌ర్వాత కూడా పోలిక‌లు ఆగ‌డం లేదు. అయితే ఒక్క విష‌యంలో మాత్రం తొలి సీజ‌న్ ను పూర్తిగా డామినేట్ చేసింది రెండో సీజ‌న్. అదే ఓట్ల విష‌యంలో.. అది కూడా ఒకే ఒక్క‌డు మార్చేసాడు. అత‌డే కౌశ‌ల్. ఈ యాక్ట‌ర్ బ‌య‌ట ఉన్న‌పుడు సీరియ‌ల్స్ త‌ప్ప మ‌రోటి చేసేవాడే కాదు.. కానీ ఇప్పుడు హీరోగా సినిమా చేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఈయ‌న ఇమేజ్ ఇలా పెరిగిపోయింది మ‌రి. ఈయ‌న కోసం అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. కౌశ‌ల్ ఆర్మీ అంటూ ర‌చ్చ చేసారు ఫ్యాన్స్. అస‌లు ఓ  వ్య‌క్తికి బిగ్ బాస్ తో ఇంత‌గా ప్యాన్ ఫాలోయింగ్ వ‌స్తుందా అనుకుంటున్నారంతా. అస‌లు ఇండియాలోనే ఎన్న‌డూ లేనంత‌గా ఓ ఫైన‌ల్ కంటెస్టెంట్ కు 39 కోట్ల  ఓట్లు రావ‌డం అనేది నిజంగా అద్భుత‌మే. అది చేసి చూపించాడు కౌశ‌ల్.. కాదు కాదు.. కౌశ‌ల్ ఆర్మీ. 

రెండో సీజ‌న్ లో కౌశ‌ల్ తో ఎవ‌రు పెట్టుకుంటే వాళ్లు ఎలిమినేట్ అయిపోయారు. ప్ర‌తీవారం ఇదే జ‌రుగుతూ వ‌చ్చింది. పైగా కౌశ‌ల్ ను గెలిపిస్తాం చూడండి అంటూ చెప్పి మ‌రీ చేసారు ఈయ‌న ఆర్మీ. ఈయన ముందు త‌నీష్, సామ్రాట్, గీత‌మాధురి, దీప్తి క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయారు. చివ‌రికి బిగ్ బాస్ ని కూడా డామినేట్ చేసే బిగ్గ‌ర్ బాస్ లా కౌశ‌ల్ మారిపోయాడు. అంతెందుకు సినిమా వాళ్లు కూడా మూకుమ్మ‌డిగా కౌశ‌ల్ కే స‌పోర్ట్ చేసారు కూడా. అస‌లు ఎవ‌రూ ఊహించ‌నంత‌గా కౌశ‌ల్ వ్య‌క్తిగా వ‌చ్చి శ‌క్తి అయిపోయాడు. ఇప్పుడు ఈయ‌న వ‌చ్చిన ఇమేజ్ ను స‌రిగ్గా వాడుకుంటాడా లేదా అనేది అస‌లు అనుమానం. మొత్తానికి ప్రైజ్ మ‌నీ 50 ల‌క్ష‌లు గెలిచి ఔరా అనిపించాడు కౌశ‌ల్. గెలిచిన మొత్తాన్ని కేన్స‌ర్ పేషెంట్స్ కు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు కౌశ‌ల్. 

More Related Stories