English   

ఆ లీడ‌ర్ కోసం విజ‌య్ దేర‌వ‌కొండ ప్ర‌చారం

Vijay Deverakonda Will Do Political Campaigning
2018-10-01 10:37:52

సినిమా వాళ్లు అంటే రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎప్పుడూ మోజే. వాళ్ల కోసం చూస్తూనే ఉంటారు. వాళ్లు ప్ర‌చారం చేస్తే కావాల‌నుకుంటారు. ఎందుకంటే సినిమా క్రేజ్ తో ఓట్లు రాల్చుకుందామ‌నే ఆశ వాళ్ల‌కు ఉంటుంది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇదే చేస్తాడేమో అనిపిస్తుంది ప‌రిస్థితి చూస్తుంటే. అస‌లే ఈయ‌న ఇప్పుడు నోటా సినిమా చేసిన మూడ్ లో ఉన్నాడు. ఇదే ఊపులో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా వ‌చ్చేస్తాడేమో..? అయితే మ‌నోడు పాలిటిక్స్ కు దూరంగా ఉంటాడేమో కానీ ప్ర‌చారానికి మాత్రం కాదు.

విజ‌య్ దేవ‌ర‌కొండ టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బంధువు. మంత్రి కేటీఆర్ విజ‌య్ కి బావ అవుతాడ‌నే టాక్ ఉంది. వాళ్ల అండ‌తోనే విజ‌య్ ఎదుగుతున్నాడ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌తీ సినిమాకు కేటీఆర్ కూడా త‌న‌వంతుగా ఫ్రీ ప్ర‌మోష‌న్ చేస్తుంటాడు. మొన్న గీత‌గోవిందం కూడా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. ఇంటికి వెళ్లొచ్చాడు కూడా. ఇప్పుడు నోటాకు కూడా కేటీఆర్ అప్పుడే ప్ర‌చారం మొద‌లుపెట్టాడు. టిఆర్ఎస్ పార్టీకి విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌చారం చేస్తాడా అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతుందిప్పుడు. అయితే దీనికి విజ‌య్ నుంచి స‌మాధానం వ‌చ్చేసింది.

తాను రాజ‌కీయ పార్టీకి ప్ర‌చారం చేయ‌డానికి దూరంగా ఉంటాన‌ని.. అయితే వ్య‌క్తికి మాత్రం ప్ర‌చారం చేస్తానేమో అన్నాడు. ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు కేటీఆర్. ఈయ‌న విజ‌య్ కు బావ అవుతాడు. అవ‌స‌రం అనుకుంటే కేటీఆర్ కు ట్విట్ట‌ర్ లో కానీ.. ఇతర సోష‌ల్ మీడియా స్టేజ్ ల‌పై కానీ విజ‌య్ ఈయ‌న‌కు స‌పోర్ట్ చేస్తాడ‌నే వార్త‌లు బ‌లంగా వ‌స్తున్నాయి. ఈయ‌న‌కు ఉన్న క్రేజ్ వాడుకోడానికి కేటీఆర్ కూడా ప్లాన్ చేస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి రానున్న ఎన్నిక‌ల్లో విజ‌య్ దేర‌వ‌కొండ‌ను కూడా ప్ర‌చారక‌ర్త‌గా చూడొచ్చ‌న్న‌మాట‌.

More Related Stories