English   

విజ‌య్..ఊస‌ర‌వెల్లి ఆఫ్ టాలీవుడ్

Vijay-Deverakonda
2018-10-01 12:50:27

అదేంటి ఊస‌ర‌వెల్లి ఎన్టీఆర్ క‌దా అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ ఇప్పుడు మాత్రం నిజ‌మైన ఊస‌ర‌వెల్లి విజ‌య్ దేర‌వ‌కొండే. ఎక్క‌డ ఎప్పుడు కావాలంటే అక్క‌డ అలా రంగులు మార్చేస్తుంటాడు ఈ హీరో. ముఖ్యంగా ఎప్పుడు ఏ పాత్ర చేస్తే అందులోకి దూరిపోతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈ కుర్ర హీరో. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన నోటా ప‌బ్లిక్ మీట్ లో చాలా విష‌యాలు మాట్లాడాడు విజ‌య్. ముఖ్యంగా సినీ ముచ్చ‌ట్లు కాకుండా రాజ‌కీయాల గురించి మాట్లాడాడు ఈ హీరో. ఎందుకంటే ఇది రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా కాబ‌ట్టి ఇంకా ఆ పాత్ర‌లోనే ఉన్నాడు ఈ హీరో. ప్రేక్ష‌కుల ముందు హామీలు ఇచ్చాడు. భ‌ర‌త్ అనే నేనులో మ‌హేష్ బాబులా ప్రామిస్ లు కూడా చేసాడు. అయినా పైకి చూడ్డానికి అమాయ‌కంగా క‌నిపిస్తాడు కానీ లోప‌ల మాత్రం చేసేది చేస్తూనే ఉంటాడు. 

విజ‌యవాడ గురించి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల‌పై కూడా మ‌న‌సులో మాట చెప్పాడు. రాష్ట్రాలు విడిపోయినా కూడా ఎప్పుడూ మ‌నం ఒక్క‌టే అని.. త‌న‌కెప్పుడూ రెండు రాష్ట్రాలు ఉన్న‌ట్లు కూడా అనిపించ‌దు అని చెప్పాడు ఈ హీరో. అంతేకాదు.. విజ‌య‌వాడ‌లో సినిమాలు, రాజ‌కీయాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఇప్పుడు త‌న సినిమాలో రెండు క‌లిపి తీసుకొస్తున్నాను ఎంజాయ్ చేయండంటూ చెప్పుకొచ్చాడు. అక్క‌డితో ఆగ‌కుండా కొత్త రాజ‌ధాని వ‌స్తుంది.. కొత్త కాలేజ్ లు వ‌స్తున్నాయ్ సూప‌ర్ అంటూ పొలిటిక‌ల్ స్పీచ్ కూడా ఇచ్చాడు. అర్జున్ రెడ్డి స‌మ‌యంలో నిజంగానే అర్జున్ రెడ్డిలా ఫీల్ అయిపోయాడు ఈ హీరో. ఇక గీత‌గోవిందం టైమ్ లో గోవిందంలా ప‌ద్ద‌తిగా మారిపోయాడు. ఇప్పుడు నోటాలో రాజ‌కీయ నాయ‌కుడు కాబ‌ట్టి అలా మారిపోతున్నాడు. మొత్తానికి ఏ సినిమా చేస్తే అలా మారిపోతూ నిజంగానే ఊర‌స‌వెల్లి అయిపోతున్నాడు ఈ కుర్ర హీరో. 

More Related Stories