English   

కట్ చేసిన సీన్లే కలుపుతారట..  

Deva-Das
2018-10-01 14:23:47

చాలా సినిమాలు ఫ్లాప్ టాక్ వస్తేనో లేక యావరేజ్ టాక్ తెచ్చుకుంటేనో.. వెంటనే కొన్ని సీన్స్ యాడ్ చేస్తారు. లేదంటే టైమ్ ను బట్టి మరికొన్ని సీన్స్ కట్ చేస్తారు. అయితే దేవదాస్ విషయంలో రెండూ జరుగుతున్నాయి. ఈ సీన్స్ అవసరమా అని వీళ్లే రిలీజ్ కు ముందు కొన్ని సీన్స్ కట్ చేశారట. ఇప్పుడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే ఉన్నాయి. దీంతో మరిన్ని సీన్స్ కలపాలనుకుంటున్నారట. అయితే ఈ సీన్స్ ఆల్రెడీ వీళ్లు కట్ చేసినవే కావడం విశేషం. నిజానికి ఈ సినిమా ఫ్లో ఒక్కోసారి సడెన్ గా మారినట్టు కనిపిస్తుంది. అందుకు కారణం వీళ్లు తీసేసిన సీన్సేనట. ఇప్పుడు వాటిని కలిపితే అంతా సాఫీగా ఉంటుందనేది వీరి ఆలోచన అంటున్నారు. అయితే వాళ్లే బావుండవు అనుకున్న సీన్స్ ఆడియన్స్ కు నచ్చుతాయా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా..  అయితే వీళ్లు కాదనుకున్నా.. అవేమీ బోరింగ్ సీన్స్ కావట. మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ నే అందించే సన్నివేశాలంటున్నారు. పైగా ఇవి కూడా సెకండ్ హాఫ్ లోనే ఎక్కువగా ఉన్నాయట. నిజానికి ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గింది. మరి వీటిని కలిపితే అది కవర్ అవుతుందా అనేది చూడాలి. ఏదేమైనా కట్ చేసిన సీన్సే మళ్లీ పేస్ట్ చేయడం ఈ మధ్య ఇదే చూడ్డం. 

More Related Stories