English   

మ‌హాన‌టి సీన్ సిరిగిందిగా..

Keerthy Suresh Given One More Disaster Movie in Tamil and Telugu
2018-10-01 15:13:57

ఏడాది మొద‌ట్లో అజ్ఞాత‌వాసితో దారుణ‌మైన డిజాస్ట‌ర్ ఇచ్చింది కీర్తిసురేష్. దాంతో ఈమె కూడా అంద‌ర్లాంటి హీరోయినే.. స్టార్ హీరోల సినిమాల్లో తోలుబొమ్మ‌లాగే మిగిలిపోయింది. అన‌వ‌స‌రంగా ఈమెను స్టార్ హీరోయిన్ అనుకున్నాం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. సూర్య గ్యాంగ్ లో కూడా ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్ చేసింది కీర్తి. కానీ ఆ త‌ర్వాత మ‌హాన‌టితో ఈమె క్రేజ్ ఆకాశానికి వెళ్లింది. అందులో సావిత్రి అమ్మ‌లా అచ్చంగా న‌టించి ఆమెను గుర్తు చేసింది కీర్తిసురేష్. ఈ సినిమాతో గౌర‌వాన్ని కూడా ద‌క్కించుకుంది కీర్తిసురేష్. తెలుగులో ఈ చిత్రం త‌ర్వాత సినిమాలేవీ చేయ‌క‌పోయినా కూడా ఇప్ప‌టికీ కీర్తిని మోడ్ర‌న్ మ‌హాన‌టిగానే చూస్తున్నారు ప్రేక్ష‌కులు. కానీ ఇలాంటి టైమ్ లో వ‌చ్చిన సామితో మ‌రో దారుణ‌మైన డిజాస్ట‌ర్ అందుకుంది ఈ భామ‌.

Keerthy Suresh Photos

విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కించాడు. ఈ చిత్రం క‌నీసం ఒక్క‌రోజు కూడా ఆడ‌కుండానే థియేట‌ర్స్ లోంచి ప‌రారైపోయింది. 8 కోట్ల వ‌ర‌కు తెలుగు వ‌ర్ష‌న్ బిజినెస్ చేసి క‌నీసం 2 కోట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. ఇక త‌మిళ‌నాట 15 కోట్ల మార్క్ కూడా అందుకోలేక దారుణ‌మైన డిజాస్ట‌ర్ గా నిలిచిపోయింది ఈ చిత్రం. అస‌లు పోలీస్ డ్రామాలు తీయ‌డంలో ఆరితేరిపోయిన హ‌రి.. సింగం 3తో పాటు సామి విష‌యంలోనూ పూర్తిగా ట్రాక్ త‌ప్పాడు. ఈ రెండు సినిమాల‌తోనూ డిజాస్ట‌ర్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు సామి ఫ‌లితం మాత్రం కీర్తిసురేష్ కెరీర్ పై ప్ర‌భావం చూపిస్తుంది. త‌మిళ‌నాట శివ‌కార్తికేయ‌న్ తో చేసిన ర‌జినీ మురుగ‌న్, రెమో త‌ప్ప మిగిలిన సినిమాల‌న్నీ పెద్ద‌గా ఆడ‌లేదు. విజ‌య్ భైర‌వా మాత్రం యావ‌రేజ్ గా ఆడింది. మిగిలిన‌వ‌న్నీ ఫ్లాప్. దాంతో ఇప్పుడు త‌మిళ‌నాట కీర్తి కెరీర్ డైల‌మాలో ప‌డిపోయింది. మ‌రి ఇప్పుడు సామి ఇచ్చిన షాక్ నుంచి కీర్తిసురేష్ ను విశాల్ పందెంకోడి 2 అయినా తీసుకొస్తుందో లేదో చూడాలి..!

Keerthy Suresh Photos 01

More Related Stories