English   

చిరంజీవికి పోటీగా వ‌స్తున్న అమితాబ్.. 

Amitabh-Bachchan
2018-10-01 17:04:58

అమితాబ్ బ‌చ్చ‌న్ బాలీవుడ్ మెగాస్టార్.. చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్.. ఈయ‌న ఆయ‌నకెందుకు పోటీ వ‌స్తాడు అనుకుంటున్నారా..? ఇప్పుడిదే జ‌రిగేలా ఉంది మ‌రి. 75 ఏళ్ల వ‌య‌సులో అమితాబ్ చేస్తున్న సాహ‌సాలు చూస్తుంటే అస‌లు ఈయ‌న వ‌య‌సు ఎంత అనే అనుమానం వ‌స్తుంది. ఈ ఏజ్ లో ఇంత‌గా ఎలా సాహ‌సాలు చేస్తున్నాడు.. అస‌లు అమితాబ్ కు ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా అనుకుంటూ షాక్ లో ఉండిపోయారు అభిమానులంతా. లేక‌పోతే మ‌రేంటి.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ట్రైల‌ర్ లో ఒక‌ప్ప‌టి యాక్ష‌న్ హీరో అమితాబ్ ను గుర్తు చేసాడు బిగ్ బి. ఇక ఇదే అమితాబ్ బ‌చ్చ‌న్ సైరాలో చిరు గురువు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 

థ‌గ్స్ లో అమీర్ ఖాన్ తో పోటీప‌డి మ‌రీ యాక్ష‌న్ సీన్స్ చేసాడు అమితాబ్. ఇదే చిరుకు స‌వాల్ విసురుతుంది. చిరంజీవి వ‌య‌సు 64.. అమితాబ్ వ‌య‌సు అతడికంటే 13 ఏళ్లు ఎక్కువ‌. అయినా కూడా ఇంత ఉత్సాహంగా ఫైట్ సీన్స్ చేసాడు. ఇప్పుడు సైరాలో అంత‌కంటే బాగా చిరు చేయాల్సిందే. లేదంటే అమితాబ్ ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌దు. అందుకే ఇప్పుడు మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడు మెగాస్టార్. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో జ‌రుగుతుంది. అక్క‌డే మేజ‌ర్ యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నాడు మెగాస్టార్. మ‌రి చూడాలిక‌.. బిగ్ బి ముప్పును మెగాస్టార్ ఎలా తట్టుకుంటాడో..? 

More Related Stories