English   

రీమేకా.. డబ్బింగా..? తేల్చిన రాజుగారు

Dil-Raju
2018-10-01 17:12:31

కొన్ని సినిమాల కోసం భాషతో పనిలేకుండా కొందరు ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. అలాంటి సినిమాల్లో ఈ మధ్య సౌత్ లో ఇంట్రెస్ట్ పెంచిన సినిమా ‘96’. విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన తొలి సినిమా ఇది. ఇప్పటికే విజయ్ సేతుపతి తమిళ్ లో తనకూంటూ స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. హీరోయిన్ అయి 15యేళ్లు దాటుతున్నా ఇంకా త్రిష క్రేజ తగ్గలేదు. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ క్రేజ్ ఉంది. తమిళ్ లో ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. మరోవైపు ఈ మూవీ ఆడియో కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1996లో కలిసి కాలేజ్ లో చదువుకున్న ఓ ఫ్రేమికుల కథ ఇది. కానీ ఆ ఇద్దరూ విడిపోతారు. ఆమె పెళ్లి చేసుకుంటుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఓ పెళ్లికి అటెండ్ కావడానికి వచ్చిన తనను ఈ హీరో చూస్తాడు. ఇద్దరూ కలిసి మళ్లీ తమ పాత జ్ఞాపకాల్లోకి వెళతారు. ఇది కథా ప్లాట్. ఈ కథను అత్యంత హృద్యంగా చెప్పాడు దర్శకుడు అనే టాక్స్ వస్తున్నాయి కోలీవుడ్ సర్కిల్స్ లో. 

ఇక 96ను తమిళ్ లో అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీ గురించి తెలిసి ‘దిల్’ రాజు తెలుగు రైట్స్ తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి మూవీని తెలుగులో డబ్ చేస్తారా లేక రీమేక్ చేస్తారా అనే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయం ఇన్నాళ్లూ ఎటూ తేల్చని దిల్ రాజు.. లేటెస్ట్ గా ఓపెన్ అయ్యాడు. 96 ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడట. ఇందుకోసం ఇప్పటికే ఆర్టిస్టుల సెలెక్షన్ మొదలైందంటున్నారు. మరోవైపు ఈ మూవీ రీమేక్ లో నాని, సమంత నటిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ ఇద్దరూ ఆల్రెడీ ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ సినిమాల్లొ కలిసి నటించారు. క్రేజీ కపుల్ గానూ పేరుంది. నిజంగానే ఈ ఇద్దరూ నటిస్తే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ రేంజ్ మారుతుందని చెప్పొచ్చు. మరి ఈ మూవీలో నటించే లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడాలి. 

More Related Stories