English   

నోటా అంత త‌క్కువ టైమ్ లో అయిపోయిందా..?

Vijay-devarakonda
2018-10-01 23:25:23

ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో సినిమా పూర్తి చేయాలంటే క‌నీసం ఏడాది కావాలి.. ఎంత త‌క్కువ టైమ్ లో పూర్తి చేయాల‌న్నా కూడా ఆర్నెళ్లు అయితే కావాలి కానీ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా మాత్రం ఊహించ‌ని వేగంతో పూర్త‌యింది. ఈ చిత్రం కేవ‌లం 45 రోజుల్లో పూర్తి చేసామ‌ని చెప్పాడు ఈ హీరో. నోటా లాంటి భారీ సినిమాను ఇంత త‌క్కువ టైమ్ లో పూర్తి చేయ‌డం అనేది మాట‌లు కాదు. కానీ అయింది. ఇంత ప్లానింగ్ తో సినిమా పూర్తి చేయ‌డం వెన‌క‌ ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ కు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. విక్ర‌మ్ ఇరుముగ‌న్ త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. క‌చ్చితంగా నోటాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తాన‌ని ధీమాగా చెబుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

మ‌రోవైపు ద‌ర్శ‌కుడు కూడా విజ‌య్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయాడు. అస‌లు తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి న‌టున్ని చూడ‌లేద‌ని చెబుతున్నాడు. అంతేకాదు స‌త్య‌రాజ్ సైతం విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పిన ఓ డైలాగ్ కు పూర్తిగా ఫ్లాట్ అయిపోయాడు. మూడు పేజీల డైలాగ్ ఒక్క టేక్ లో చెప్పి అద్భుతం చేసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ క‌ష్టం అంతా రేపు స్క్రీన్ పై క‌నిపిస్తుంద‌ని చెబుతున్నాడు విజ‌య్. మొత్తానికి ఇంత త‌క్కువ టైమ్ లో పూర్తి చేసినా కూడా క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేద‌ని చెప్పాడు విజ‌య్ దేవ‌రకొండ‌. రేపు థియేట‌ర్స్ లో చూసిన‌పుడు ఆ ఎక్స్ పీరియ‌న్స్ మీరు కూడా పొందుతారంటున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. నోటాతో విజ‌య్ ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెరతీస్తాడో..?

More Related Stories