English   

రౌడీ ప్రొడ్యూసర్ అయ్యాడు..!! 

Vijay-Deverakonda
2018-10-01 23:56:00

ఎక్క‌డ సంపాదించారో అక్క‌డే ఖ‌ర్చు చేయ‌డం అలవాటు చేసుకున్నారు మ‌న హీరోలు. అందుకే న‌ట‌న‌పై కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది హీరోలు సొంతంగా నిర్మాణ సంస్థ‌లు మొద‌లు పెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా వ‌చ్చి చేరిపోయాడు. ఈయ‌న కూడా నిర్మాత‌గా మారాడు ఇప్పుడు. ఈయ‌న తాజా చిత్రం నోటాకు ఓ నిర్మాత‌గా ఉన్నాడు విజ‌య్ దేర‌వ‌కొండ‌. ఈయ‌న త‌న పేరు మీదే ఓ నిర్మాణ సంస్థ‌ను మొద‌లు పెట్టాడు. త‌న నిర్మాణంలో త‌న సినిమాల‌తో పాటు బ‌య‌టి హీరోల‌తో కూడా క‌థ కుదిర్తే సినిమాలు చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నాడు. పైగా త‌న త‌మ్ముడును కూడా ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

అంత‌లోనే ఇప్పుడు నిర్మాత‌గా కూడా మారాడు ఈ హీరో. నోటాతో పాటు మ‌రో రెండు సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉన్నాడు ఈ హీరో. కుదిర్తే వాటిలో కూడా నిర్మాణ భాగ‌స్వామిగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేశ్ బాబు.. సుధీర్ బాబు.. క‌ళ్యాణ్ రామ్.. రామ్ చ‌ర‌ణ్.. నితిన్ లాంటి కుర్ర హీరోలు చాలా మంది నిర్మాత‌లుగా మారారు. మొన్నే బాల‌కృష్ణ కూడా నిర్మాత‌గా మారాడు. త‌న తండ్రి సినిమాను ఎన్బికే ప్రొడ‌క్ష‌న్స్ లోనే నిర్మిస్తున్నాడు. ఇప్ప‌డు విజ‌య్ కూడా ఇదే చేయ‌బోతున్నాడు. విజ‌య్ దేర‌వ‌కొండ నిర్మాణంలోనే త‌న సినిమాలు  చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. దానివ‌ల్ల ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తో పాటు లాభాల్లో వాటా కూడా వ‌స్తుంది. మ‌రి ఇది విజ‌య్ ఫేట్ ఎంత వ‌ర‌కు మారుస్తుందో చూడాలిక‌..

More Related Stories