English   

బాల‌య్య‌ను ఫాలో అవుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్..

Pawan-Kalyan
2018-10-02 05:27:59

అదేంటి.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో ఉన్నాడు.. బాల‌య్య సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.. పైగా తెలుగుదేశంతో ఈయ‌న‌కు బంధాలు కూడా తెగిపోయాయి ఇప్పుడు ఎలా బాల‌య్య దారిలో ప‌వ‌న్ వెళ్తున్నాడు అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ ఇప్పుడు ప‌వ‌న్ నిజంగానే బాల‌య్య‌ను ఫాలో అవుతున్నాడు. అందులో కూడా నిజం ఉంది. ఇంత‌కీ ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు దేవుళ్లను బాగా న‌మ్ముతున్నాడు. మ‌రీ ముఖ్యంగా ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామికి ఈయ‌న పూజ‌లు చేస్తున్నాడు. న‌ర‌సింహ స్వామిని బాల‌య్య బాగా న‌మ్ముతాడు. ఆయ‌న ఏం చేయాల‌న్నా ముందుగా ల‌క్ష్మీ న‌ర‌సింహున్ని ద‌ర్శించుకున్న త‌ర్వాతే చేస్తాడు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా ఇదే చేస్తున్నాడు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల వద్ద ఉన్న జగన్నాధపురం గ్రామంలోని నరసింహ స్వామి ఆలయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని రహస్య పూజలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ పూజలు జరుగుతున్నంత సేపు ఆలయంలోకి ఎవర్ని అనుమతించలేదని తెలుస్తుంది. ఆయ‌న ప్ర‌త్యేకంగా పూజలు చేయించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ప‌దేళ్ళ కిందే ఇదే ఆలయంలో పవన్ తన ‘జల్సా’ విడుదలకు ముందు కొన్ని పూజలు చేయించుకున్నాడు. అప్పుడు ఆ సినిమా బాగానే ఆడింది. ఆ త‌ర్వాత ఈ గుడి ప‌వ‌న్ కు సెంటిమెంట్ గా మారింది. ప్రస్తుతం రోజు రోజుకు రాజకీయాలలో పవన్ మేనియా త‌గ్గిపోతున్న ఈ స‌మ‌యంలో మున‌ప‌టి ప్రాభ‌వం రావాల‌ని న‌ర‌సింహున్ని ద‌ర్శించుకుంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఏదేమైనా ఇప్పుడు బాల‌య్య దారిలోనే వెళ్లి విజ‌యం సాధించాల‌ని చూస్తున్నాడు ఈ ప‌వ‌ర్ స్టార్. మ‌రి ఈయ‌న కోరిక ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుంది..? ప‌వ‌న్ కూడా ల‌క్ష్మీన‌ర‌సింహుడి ఆశీస్సుల‌తో రాజ‌కీయాల్లో సత్తా చూపిస్తాడో లేదో చూడాలిక‌..!

More Related Stories