English   

చెల్లి కోసం స‌ల్మాన్ తిప్ప‌లు

Salman Khan Made a Promotional Song For Aayush Sharma's Loveratri
2018-10-02 12:53:53

చెల్లి అన్న త‌ర్వాత అన్న‌య్య‌కు కొన్ని బాధ్య‌త‌లు ఉంటాయి. వాళ్ల కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉంటారు అన్న‌య్య‌లు. ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న కూడా త‌న చెల్లి కోసం చేయాల్సిన ప‌నుల‌న్నీ.. ప‌డాల్సిన తిప్ప‌ల‌న్నీ ప‌డుతున్నాడు. ముఖ్యంగా బావ‌లు బామ్మ‌ర్దుల బ‌తుకు కోరుతార‌ని చెబుతుంటారు. ఇప్పుడు స‌ల్లూభాయ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న త‌న చెల్లి భ‌ర్త ఆయుష్ శ‌ర్మ కోసం ఐటం బాయ్ గా మారుతున్నాడు. బామ్మ‌ర్దిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఈయ‌న ల‌వ్ రాత్రి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అభిరాజ్ తెర‌కెక్కించాడు. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. పాట‌ల‌కు రెస్పాన్స్ కూడా బాగుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం ప్రమోషనల్ సాంగ్ లో న‌టించాడు స‌ల్మాన్ ఖాన్. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈ చిత్రంతో బావను ఇండ‌స్ట్రీలో హీరోగా నిల‌బెట్టాల‌ని చూస్తున్నాడు స‌ల్లూభాయ్. దానికోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు. త‌న‌తో పాటు ఇండ‌స్ట్రీ మొత్తాన్ని బావ సినిమా కోసం ప్ర‌మోట్ చేయిస్తున్నాడు. షారుక్ ఖాన్ కూడా ఆయుష్ శ‌ర్మ‌ను ప్ర‌మోట్ చేస్తున్నాడు. అందులోనూ అర్పితా ఖాన్ అంటే షారుక్ కు కూడా చాలా ఇష్టం. అందుకే అన్న‌గా c. అందులోనూ స‌ల్మాన్ ఖాన్ అడిగిన త‌ర్వాత షారుక్ నో చెప్పే సమ‌స్యే ఉండ‌దు. మొత్తానికి చూడాలి.. చెల్లి కోసం స‌ల్మాన్ ప‌డుతున్న తిప్ప‌లు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో...?

More Related Stories