English   

మ‌ళ్ళీ సైకిల్ ఎక్కిన ఎన్టీఆర్.. 

Aravinda-Sametha
2018-10-02 13:04:53

ఎన్టీఆర్ కు సైకిల్ కు చాలా ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయి. అస‌లు వాళ్లు ఉన్న‌దే సైకిల్ నుంచి. అందుకే నంద‌మూరి వంశానికి సైకిల్ అంటే చాలా ఇష్టం. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఈ సైకిల్ నుంచి. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వ‌ర‌కు అంతా సైకిల్ ఎక్కిన వాళ్లే. ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా మ‌రోసారి ఇదే చేస్తున్నాడు. అర‌వింద స‌మేత కోసం మ‌రోసారి సైకిల్ ఎక్కాడు నంద‌మూరి చిన్నోడు. అర‌వింద స‌మేత‌ను సైకిల్ స‌మేత‌నే రానున్నాడు ఈ హీరో. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ లో కూడా పూజాహెగ్డేతో క‌లిసి సైకిల్ ఎక్కి వ‌స్తున్నాడు జూనియ‌ర్. ఈ చిత్ర ట్రైల‌ర్ అక్టోబ‌ర్ 2 రాత్రి 8.10 నిమిషాల‌కు విడుద‌ల కానుంది. మ‌చ్చ‌ల పులి గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటూ ఇప్ప‌టికే టీజ‌ర్ లో ర‌చ్చ చేసాడు ఎన్టీఆర్. 

ఇప్పుడు ట్రైల‌ర్ కూడా అంతకంటే సీరియ‌స్ వేలో ఉంటుంద‌ని తెలుస్తుంది. అస‌లు త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల మాదిరి ఇందులో కామెడీ ఎక్కువ‌గా ఉండ‌ద‌ని.. అత‌డు సినిమా త‌ర‌హాలో ఇందులో హీరో పాత్ర చాలా సీరియ‌స్ గా సాగుతుంద‌ని తెలుస్తుంది. వీర‌రాఘ‌వ రెడ్డిగా ఎన్టీఆర్ ర‌ప్ఫాడించ‌డానికి రెడీగా ఉన్నాడు. అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్టోబ‌ర్ 2న హైద‌రాబాద్ లోని నొవెట‌ల్ లో గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది. దీనికి బ‌య‌టి నుంచి అతిథులెవ‌రూ రావ‌డం లేదు కానీ త్రివిక్ర‌మ్ స్టైల్ లో త‌న టీం అంతా రానుంది. వాళ్ల‌తోనే ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. పైగా హ‌రికృష్ణ చ‌నిపోయిన త‌ర్వాత వ‌స్తున్న తొలి సినిమా కావడంతో ఎన్టీఆర్ ఏం మాట్లాడ‌తాడు అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు.

More Related Stories