English   

హ‌లో అంటూ గిల్లేస్తున్న అదితిరావ్ హైద్రీ.. 

Aditi-Rao-Hydari
2018-10-02 17:30:36

అదితిరావ్.. ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా ఎక్కువ‌గానే వినిపిస్తున్న పేరు ఇది. స‌మ్మోహ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ భామ‌. తెలుగమ్మాయిలు అంటే చాలు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అస్స‌లు ప‌ట్టించుకోరు. ఎప్పుడూ పొరుగింటి పుల్ల‌కూరే కావాలంటారు. కోట్ల‌కు కోట్లు ఇచ్చి అక్క‌డ్నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌ల‌కే మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అవ‌కాశ‌మిస్తుంటారు. ఫ‌ర్ ఎగ్జాంపుల్.. అదితిరావ్ హైద్రీనే తీసుకోండి. ఈ భామ అచ్చ‌తెలుగ‌మ్మాయి. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. హైద్రాబాద్ నుంచే బాంబే వెళ్లింది అదితి. వ‌న‌ప‌ర్తి సంస్థానాధీశురాలు ఈ భామ‌. రాజ‌వంశాలు ఇప్పుడు లేవు కాబ‌ట్టి అప్ప‌ట్లోనే వీళ్లు ముంబై వ‌ల‌స వెళ్లారు. 

ఇక అదితి కూడా అక్క‌డే ప్ర‌య‌త్నాలు చేసుకుంది. స‌క్సెస్ కూడా అయింది. మ‌ణిర‌త్నం చెలియాతో సౌత్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌తోనే న‌వాబ్ సినిమా చేసి హిట్ కొట్టింది. దానికి తోడు అప్పుడ‌ప్పుడూ ఇలా హ‌లో అంటూ అందాలతో హాయ్ చెబుతుంది అదితి. తాజాగా హెల్లో మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది ఈ బ్యూటీ. ఓ వైపు హాయిగా సినిమాల చేస్తూనే మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది. గ్లామ‌ర్ షో తో మ‌తులు పోగొడుతుంది ఈ తెలుగ‌మ్మాయి. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం సినిమాలో న‌టిస్తుంది అదితిరావ్ హైద్రీ. మొత్తానికి ఈమె తీరు చూస్తుంటే సౌత్ ఇండ‌స్ట్రీలోనే పాతుకుపోవాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి అదితి ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు నెర‌వేర‌తాయో చూడాలిక‌..!

More Related Stories