English   

మ‌ణిక‌ర్ణిక టీజ‌ర్.. ప్రైడ్ ఆఫ్ బాలీవుడ్.. 

Manikarnika
2018-10-02 18:08:27

ఇప్పుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత ఇంకో మాట‌లేవీ మాట్లాడ‌టానికి లేదు. అంత‌గా ఈ పాత్ర‌లో లీన‌మైపోయింది కంగ‌న ర‌నౌత్. గాంధీజ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన మ‌ణిక‌ర్ణిక టీజ‌ర్ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. బాలీవుడ్ లో క్రిష్ కు ఇది రెండో సినిమా. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించిన గ‌డ్డ‌పైనే మ‌ణిక‌ర్ణిక షూటింగ్ ఏడాదిన్న‌ర కింద మొద‌లు పెట్టాడు క్రిష్. మూడు నెల‌ల కిందే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చాడు క్రిష్. అయితే మ‌ధ్య‌లో కంగ‌న ర‌నౌత్ కు యాక్సిడెంట్ కావ‌డం.. ఆమెతోనే వివాదాలు విభేధాల కార‌ణంగా సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాడు. మిగిలిన పార్ట్ తో పాటు కొంత భాగం రీ షూట్లు కూడా కంగ‌న తానే సొంతంగా చేసుకుంది. 

1828లో కాశీలోనే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించింది. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కంగ‌న ర‌నౌత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రం కోసం క్రిష్ తో పాటు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ను కూడా ఎంచుకుంది. మ‌ణిక‌ర్ణిక సినిమాకు క‌థ అందించింది ఆయ‌నే. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే సినిమా రేంజ్ అర్థ‌మైపోతుంది. క‌ద‌న‌రంగంలోకి దూకి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ శ‌త్రువుల‌ను చీల్చి చెండాడుతుంటే చూస్తున్న వాళ్ల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. 2019 జ‌న‌వ‌రి 25న సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఇన్నేసి వివాదాల మ‌ధ్య వ‌స్తున్న మ‌ణిక‌ర్ణిక ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌బోతుందో..?

More Related Stories