English   

నోటా.. మ‌రీ ఎక్కువ ఊహించుకుంటున్నారా..?

Vijay-Devarakonda
2018-10-02 19:43:22

కొన్నిసార్లు ఒక్క సినిమా హిట్ కాగానే ఆ హీరోపై లేనిపోని అంచ‌నాలు పెంచుకుంటుంటారు బ‌య్య‌ర్లు. ఇక నిర్మాతలైతే ముందు వెన‌క ప‌ట్టించుకోకుండా బ‌డ్జెట్ పెడుతుంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో ఇదే జ‌రుగుతుందా అనిపిస్తుంది. ఈయ‌న రెండేళ్లుగా సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. పెళ్లిచూపులు గాలివాటం అనుకుంటే అర్జున్ రెడ్డితో కాద‌ని నిరూపించాడు. అర్జున్ రెడ్డి ఏదో యూత్ కు న‌చ్చేసిందేమో అని తీసేయాల‌నుకుంటే గీత‌గోవిందంతో తాను అంద‌రివాన్ని అని నిరూపించుకున్నాడు విజ‌య్. దాంతో ఇప్పుడు ఈయ‌న సినిమాల‌పై అంచ‌నాలు భారీగా ఉంటున్నాయి. ఇదే న‌మ్మ‌కంతో ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన నోటా బిజినెస్ ఏకంగా 25 కోట్లు దాటేసింది. 

తెలుగులో ఈ సినిమాను 19 కోట్ల‌కు అమ్మేసారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో అయినా కూడా ఇది ద్విభాషా చిత్రం. బై లింగువ‌ల్ సినిమాల‌కు అంత బిజినెస్ చేయ‌డం నిజంగా అద్భుత‌మే. ఎందుకంటే ఏ చిన్న తేడా జ‌రిగినా కూడా అస‌లుకే మోసం వ‌స్తుంది. అయితే విజ‌య్ ఉన్నాడ‌నే ధైర్యంతో ఇప్పుడు బ‌య్య‌ర్లు కూడా కొనేసారు. పొలిటిక‌ల్ సినిమా కావ‌డంతో క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు విజ‌య్. తెలుగు, త‌మిళ్, ఓవ‌ర్సీస్ అన్నీ క‌లిపి ఈ చిత్రాన్ని 30 కోట్ల‌కు పైగానే అమ్మేసారు. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. విజ‌య్ నిజంగానే ఇంత భారం మోస్తాడా లేదా అనేది..? 

More Related Stories