English   

అర‌వింద స‌మేత ఎమోష‌న‌ల్ ట‌చ్

NTR's Aravindha Sametha Trailer Review
2018-10-02 20:49:25

మీ తాత క‌త్తిప‌డితే అది అవ‌స‌రం.. అదే మీ నాయ‌న క‌త్తి ప‌డితే అది వారస‌త్వం.. అదే క‌త్తి ఇప్పుడు నువ్వు కూడా ప‌డితే అది ల‌క్ష‌ణం.. రేపు నీ బిడ్డ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి అది లోపం కాకుండా చూసుకో.. అంటూ అర‌వింద స‌మేత‌లో త్రివిక్ర‌మ్ రాసిన ఒక్క డైలాగ్ సినిమా క‌థ‌ను మొత్తం చెప్ప‌క‌నే చెప్పేసింది. ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్ అని ముందు నుంచి చెబుతూనే ఉన్నా.. మ‌రీ ఇంత‌గా ఉంటుంద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. పూర్తిగా మ‌రోసారి ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ అయిపోయాడు జూనియ‌ర్. ఆది, సాంబ రోజుల్ని గుర్తు చేసాడు. మ‌రోసారి అదే సీమ ప‌గ‌లు.. ప్ర‌తీక‌రాలు.. నరుక్కోవ‌డం చంపుకోవడంతోనే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ కూడా వ‌చ్చాడు. ఇక ట్రైల‌ర్ మొద‌ట్లో ప్రేమ‌గా మొద‌లుపెట్టి.. చివ‌ర్లో పూర్తిగా ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చారు. అది కేవ‌లం ఎన్టీఆర్ కోస‌మే అనే టాక్ కూడా ఉంది.

తండ్రి పోయిన బాధ‌లో ఉన్న జూనియ‌ర్ కోస‌మే ఇలాంటి ఎమోష‌న‌ల్ ట్రైల‌ర్ క‌ట్ చేసారేమో అని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాక‌పోతే స‌మ‌ర‌సింహారెడ్డి నుంచి హీరోలు చెబ‌తున్న‌ట్లే చివ‌ర్లో ఈ ప‌గ‌లు ఆపేద్దాం అంటూ సందేశం ఇస్తున్నారు. ఇప్పుడు అర‌వింద స‌మేత‌లో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న కూడా చివ‌ర్లో 99 అడుగులు తవ్వినా నీరు రాన‌పుడు 100వ అడుగు త‌వ్వేవాన్ని ఏమంటారు స‌ర్.. ఇప్పుడు నేను చేసేది కూడా ఈ ఒక్క అడుగు వంద అడుగుల‌తో స‌మానం అంటూ థీమ్  మొత్తాన్ని చెప్పేసాడు ఎన్టీఆర్. అయితే ఒక్క‌టి మాత్రం నిజం.. చాలా ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ పూర్తిస్థాయి ఫ్యాక్ష‌న్ డ్రామా ఒక‌టి వ‌స్తుంది. అది కూడా ఎన్టీఆర్ లాంటి హీరోకు ప‌డ‌టంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అక్టోబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది ఈ చిత్రం మ‌రి చూడాలిక‌.. అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ ఎలా ఉండ‌బోతున్నాడో..?

More Related Stories